SarkaruVaariPaata: మళ్లీ సంక్రాంతి బరిలో మహేశ్… సర్కారు వారి పాట రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్ర యూనిట్…
2020 సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరుతో నిలిచిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 2022 సంక్రాంతిని టార్గెట్ చేశాడు. మళ్లీ సంక్రాంతి పండుగకు....

2020 సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరుతో నిలిచిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 2022 సంక్రాంతిని టార్గెట్ చేశాడు. మళ్లీ సంక్రాంతి పండుగకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. చిత్రీకరణ ప్రారంభమైన వారం రోజుల్లోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది సినిమా యూనిట్. మహేశ్ సర్కారువారి పాట 2022 సంక్రాంతి పండుగకు విడుదల కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో మహేశ్ అభిమానులు ఓ వైపు షాకవుతూనే మరోవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేశ్ తొలిసారి మహేశ్‌తో జోడీ కడుతున్నారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్, మహేశ్‌బాబు సొంతంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫి: మధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ – లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట.