Gaddar Telangana Film Awards 2024: ‘గద్దర్’ అవార్డుల ప్రకటన.. సీఎం రేవంత్ రెడ్డి గురించి చిరంజీవి ఏమన్నారంటే?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక గద్దర్ సినిమా అవార్డులను ప్రకటించింది. 2024 సంవత్సరానికి గానూ గురువారం (మే 29) జ్యూరీ పర్సన్ జయసుధ, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ఈ అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. త్వరలోనే ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

Gaddar Telangana Film Awards 2024: గద్దర్ అవార్డుల ప్రకటన.. సీఎం రేవంత్ రెడ్డి గురించి చిరంజీవి ఏమన్నారంటే?
CM Revanth Reddy, Chiranjeevi

Updated on: May 29, 2025 | 7:43 PM

ప్రతిష్టాత్మక గద్దర్ సినిమా అవార్డులను తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. టీఎఫ్ డీసీఛైర్మన్ దిల్‌రాజుతో కలిసి జ్యూరీ చైర్‌పర్సన్‌ జయసుధ అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. కాగా సుమారు 14 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సినిమా పురస్కారాలను అందించనుంది. జూన్ 14న హైదరాబాద్ హైటెక్స్‌లో 2024 గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కాగా ఈ అవార్డుల్లో ‘పుష్ప 2’ చిత్రానికి గానూ అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అలాగే ప్రభాస్ కల్కి ఉత్తమ చిత్తంగా నిలిచింది. వీటితో పాటు పలువురు సినీ ప్రముఖులు, చిత్రాలకు గద్దర్ అవార్డుల్లో స్థానం దక్కింది. ఈ క్రమంలో గద్దర్ అవార్డు విజేతలకు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గద్దర్ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు.

‘ ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్డులు అందుకోబోతున్న విజేతలు అందరికీ శుభాకాంక్షలు. ఇలాంటి అవార్డులు మన లాంటి నటులకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని పునరుద్ధరించడం చాలా సంతోషం. ఇందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆయన మంత్రివర్గానికి, అధికారులకు ధన్యవాదాలు’ అని చిరంజీవి పేర్కొన్నారు. అంతకు ముందు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా గద్దర్ అవార్డు విజేతలకు అభినందనలు తెలిపారరు.

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..

 అల్లు అర్జున్ రియాక్షన్..

 

ఇవి కూడా చదవండి..

OTT Movie: పౌర్ణమి రోజున రెచ్చిపోయే రక్త పిశాచి.. ఓటీటీలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. చిన్న పిల్లలు చూడొద్దు

Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?

Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం

Hari Hara Veera Mallu: పవన్ హరి హర వీరమల్లులో మెరిసిన టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.