Chiranjeevi: అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్న మెగాస్టార్

|

May 04, 2022 | 8:28 PM

ఆచార్య(Acharya) రిజల్ట్ కాస్త అటు ఇటు అయినప్పటికీ.. మెగాస్టార్(Chiranjeevi) మాత్రం తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నారు. ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌లో వింటేజ్‌ చిరును గుర్తు చేసేందుకు కష్టపడుతున్నారు మెగాస్టార్‌.

Chiranjeevi: అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్న మెగాస్టార్
Chiranjeevi
Follow us on

ఆచార్య(Acharya) రిజల్ట్ కాస్త అటు ఇటు అయినప్పటికీ.. మెగాస్టార్(Chiranjeevi) మాత్రం తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నారు. ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌లో వింటేజ్‌ చిరును గుర్తు చేసేందుకు కష్టపడుతున్నారు మెగాస్టార్‌. అప్‌కమింగ్ సినిమాలన్నింట్లోనూ వింటేజ్‌ డ్యాన్స్‌ మూవ్స్‌తో అలరించేందుకు పక్కాగా ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ఆచార్యతో ఈ ట్రెండ్ స్టార్ట్ చేసిన మెగాస్టార్‌.. ముందు ముందు ఆ జోష్‌ను పీక్స్‌కు తీసుకెళ్లబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్‌ అవుటింగ్ ఆచార్య. ఈ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో చిరు వేసిన స్టెప్స్ మాత్రం ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. లాహే లాహే పాటలో వేసిన సోలో స్టెప్స్‌ ఒక ఎత్తైతే భలే భలే బంజార సాంగ్‌లో చరణ్‌తో కలిసి వేసిన స్టెప్స్ మరో ఎత్తు. ఈ రెండు పాటల కోసమే ఆచార్య సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నారు ఫ్యాన్స్‌.

అందుకే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌లోనూ సాంగ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మెగాస్టార్‌. గాడ్‌ ఫాదర్ సినిమాలో కీలక సమయంలో వచ్చే సాంగ్‌ కోసం క్రేజీ కాంబినేషన్‌ను సెట్‌ చేస్తున్నారు. ఒక్క సాంగ్ మినహా గాడ్ ఫాదర్ షూటింగ్ అంతా పూర్తయ్యింది. ఫైనల్‌ సాంగ్‌, అది కూడా టైటిల్ సాంగ్ కావటంతో మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. చిరుతో పాటు సల్మాన్‌ కూడా స్టెప్పేస్తున్న పాటను లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కంపోజ్ చేయబోతున్నారు. స్టార్ స్టార్ మెగాస్టార్ అంటూ చిరులోని గ్రేస్‌ను ఫస్ట్ చాన్స్‌లోనే పర్ఫెక్ట్‌గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా.

దశాబ్దాలుగా ఈ క్రేజీ కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. గ్యాంగ్ లీడర్‌, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఈ కాంబినేషన్‌లోనే అలరించాయి. అందుకే ఇప్పుడు గాడ్ ఫాదర్ సాంగ్ విషయంలో స్పెషల్ హైప్‌ క్రియేట్ అవుతోంది. గాడ్ ఫాదర్ మాత్రమే కాదు ఆ తరువాత సినిమాల్లో కూడా మాస్ మూవ్స్ ఇరగదీస్తా నంటున్నారు మెగాస్టార్. భోళా శంకర్ సినిమా కోసం శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో అదిరిపోయే ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను రెడీ చేస్తున్నారు. చిరు, శేఖర్‌ది కూడా సూపర్ హిట్ కాంబోనే కావటంతో ఫ్యాన్స్‌.. ఈ సాంగ్ విషయంలోనూ భారీ అంచనాలే పెట్టుకున్నారు. నెక్ట్స్ బాబీ, వెంకీ కుడుముల సినిమాలు కూడా మాస్ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్సే కావటంతో కమర్షియల్‌ బీట్స్‌ కు కొదవుండదు. ఆ బీట్స్‌కు మెగా స్టెప్స్‌ మరో లెవల్‌లో అలరించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌.

Beast OTT: ఓటీటీలోకి ‘బీస్ట్‌’ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే.. అధికారిక ప్రకటన..

Viral Video: ఎయిర్ పోర్టులో లగేజీ ట్రాలీతో పరుగులు పెట్టిన సీత.. షాకైన ప్రయాణికులు..