Chiranjeevi: తెలుగు బిడ్డ పీవీ నరసింహరావుకు భారత రత్న.. పద్మ విభీషణుడు చిరంజీవి ఏమన్నారంటే?

తెలుగు బిడ్డ, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న వరించింది. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పీవీ కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ ప్రముఖులు స్వాగతిస్తున్నారు. కాస్త ఆలస్యమైనా పీవీకి గొప్ప గుర్తింపు లభించిందంటున్నారు.

Chiranjeevi: తెలుగు బిడ్డ పీవీ నరసింహరావుకు భారత రత్న.. పద్మ విభీషణుడు చిరంజీవి ఏమన్నారంటే?
PV Narasimha Rao, Megastar Chiranjeevi

Updated on: Feb 09, 2024 | 4:13 PM

తెలుగు బిడ్డ, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న వరించింది. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పీవీ కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ ప్రముఖులు స్వాగతిస్తున్నారు. కాస్త ఆలస్యమైనా పీవీకి గొప్ప గుర్తింపు లభించిందంటున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌ తో సహా పలువురు పీవీ సేవలను గుర్తు చేసుకుంటున్నారు.తాజాగా ఇదే విషయంపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. దేశంలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టిన ఘనత పీవీకే దక్కుతుందని ఆయన కొనియాడారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు చిరంజీవి. ‘నిజమైన దార్శనికుడు, బహుభాషావేత్త, పండితుడు, గొప్ప రాజనీతిజ్ఞుడైన తెలుగు బిడ్డకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న రావడం మన తెలుగువారందరికీ గర్వకారణం. దేశంలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన ఆధునిక భారతదేశాన్ని మార్చివేశారు. ప్రపంచంలో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా మారడానికి పునాది వేసిన వ్యక్తి పీవీనే. తన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించింది. ఇది భారతీయులందరితో పాటు మన తెలుగువారికి ఎంతో సంతోషకరమైన విషయం. ఈ గౌరవం లభించడం కాస్త ఆలస్యమైనప్పటికీ.. ఇంతకు మించిన గొప్పదంటూ ఏమీ ఉండదు’ అని ట్విట్టర్‌ లో రాసుకొచ్చారు చిరంజీవి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బింబిసార డైరెక్టర్‌ వశిష్టతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. సోషియో ఫాంటసీ జానర్‌ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేశారు. స్టాలిన్‌ తర్వాత మరోసారి ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నటించనుంది త్రిష. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో భారీ బడ్జెట్‌ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విశ్వంభర సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

ఇవి కూడా చదవండి

చిరంజీవి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.