Megastar Chiranjeevi: పవన్, చిరులతో మోదీ మాట్లాడింది ఇదే.. వీడియో పోస్ట్ చేసిన మెగాస్టార్..
ప్రధాని మోదీని స్వయంగా అన్నయ్యకు పరిచయం చేశారు పవర్ స్టార్. అనంతరం చిరు, పవన్‌తో మాట్లాడిన మోదీ.. మెగా బ్రదర్స్ చేతులు పట్టుకొని అభివాదం చేశారు. ఆ సమయంలో చిరు తమ్ముడిని చూస్తూ ఉప్పోంగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మోదీతో మెగా బ్రదర్స్ అనుబంధం చూసి మెగా ఫ్యాన్స్ సంతోషం అంబరాన్నంటింది. అన్నదమ్ముల బంధం ఇదే అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరికొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 12న జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ ప్రధాని మోదీతోపాటు, అమిత్ షా, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి స్టేట్ గెస్ట్‌గా.. సూపర్ స్టార్ రజినీకాంత్, మెగా పవర్ రామ్ చరణ్, మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నారు. పవన్ ప్రమాణ స్వీకారం అనంతరం స్టేజ్ పై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని మోదీని స్వయంగా అన్నయ్యకు పరిచయం చేశారు పవర్ స్టార్. అనంతరం చిరు, పవన్‌తో మాట్లాడిన మోదీ.. మెగా బ్రదర్స్ చేతులు పట్టుకొని అభివాదం చేశారు. ఆ సమయంలో చిరు తమ్ముడిని చూస్తూ ఉప్పోంగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మోదీతో మెగా బ్రదర్స్ అనుబంధం చూసి మెగా ఫ్యాన్స్ సంతోషం అంబరాన్నంటింది. అన్నదమ్ముల బంధం ఇదే అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రమాణ స్వీకారం అనంతరం తమతో మోదీ ఏం మాట్లాడారో చెబుతూ ఎమోషనల్ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. “ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు,తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ,నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు, ‘ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య వున్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయి’ అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది.
వారి సునిశిత దృష్టికి, నా కృతజ్ఞతలు. తమ్ముడి స్వాగతోత్సవంలాగే ఆయనతో..ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం గుర్తు ఉండిపోయే ఓ అపురూప జ్ఞాపకం ” అంటూ మోదీతో మాట్లాడిన వీడియో షేర్ చేశారు. ఇక చిరు షేర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారగా.. మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు,తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ,నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు, ‘ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని… pic.twitter.com/ZYg9YsSh6o
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.