Megastar Chiranjeevi: కరోనా నుంచి కోలుకున్న చిరంజీవి.. బ్యాక్ టూ వర్క్ అంటూ మెగాస్టార్ ట్వీట్..

|

Feb 06, 2022 | 9:20 AM

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త చెప్పారు. కరోనా నుంచి కోలుకుని తిరిగి షూటింగ్‏లోకి అడుగుపెట్టినట్లు చెప్పారు.

Megastar Chiranjeevi: కరోనా నుంచి కోలుకున్న చిరంజీవి.. బ్యాక్ టూ వర్క్ అంటూ మెగాస్టార్ ట్వీట్..
Megastar
Follow us on

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త చెప్పారు. కరోనా నుంచి కోలుకుని తిరిగి షూటింగ్‏లోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు మెగాస్టార్. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించినవారందరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. గత కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. కరోనా బారిన పడకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యిందని. స్వ‌ల్పంగా ల‌క్ష‌ణాలున్నాయని.. ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నట్లు ట్వీట్ చేశారు చిరు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోవిడ్ నుంచి కోలుకుని తిరిగి షూటింగ్‏లో పాల్గొన్నారు. షూటింగ్ సెట్‏లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరు. ప్రస్తుతం మెగాస్టార్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను పూర్తిచేశారు చిరంజీవి. అలాగే సెట్స్‌పై గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమాలున్నాయి. ఇవి కాకుండా వెంకీ కుడుముల సినిమాల చేయడానికి ఆయన రీసెంట్‌గానే ఓకే చెప్పారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’ సినిమా చిత్రీకరణలో చిరంజీవి పాల్గొంటున్నారు.

Also Read: Prem Kumar: నీలాంబరి అంటూ వచ్చేసిన సంతోష్ శోభన్.. ప్రేమ్ కుమార్ కలల సుందరి ఎవరంటే..

Ashu Reddy: నెట్టింట్లో అషు రెడ్డి రచ్చ.. ఏకంగా ఫోన్ నంబర్ షేర్ చేసి జలక్ ఇచ్చిన బిగ్‏బాస్ బ్యూటీ.. దండం పెట్టిన నెటిజన్..

Mahesh Babu: శంకర్‌కు మహేష్‌ క్షమాపణాలు చెప్పిన వేళ.. ఆహా అన్‌స్టాపబుల్‌లో ప్రిన్స్‌ ఆసక్తికర విషయాలు..

Eesha Rebba: ఇంత హాట్‌గా ఎలా తయారయ్యావ్‌?.. ఈషా నేచురల్ ఫొటోపై యంగ్‌ హీరోయిన్‌ నాటీ కామెంట్‌..