Megastar Chiranjeevi: రంగస్థలం మీద తొలి నాటకం.. 50 ఏళ్ల నట ప్రస్థానం.. చిరంజీవి స్పెషల్ పోస్ట్..

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు సినీరంగుల ప్రపంచంలో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు చిరు. తాజాగా మెగాస్టార్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

Megastar Chiranjeevi: రంగస్థలం మీద తొలి నాటకం.. 50 ఏళ్ల నట ప్రస్థానం.. చిరంజీవి స్పెషల్ పోస్ట్..
Megastar Chiranjeevi
Follow us

|

Updated on: Oct 26, 2024 | 10:46 AM

సినీరంగుల ప్రపంచంలో మెగాస్టార్ చిరంజీవి ఎంతోమందికి స్పూర్తి. ఈ పేరు వింటే చాలు చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని సాధారణ కుర్రాడు నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించి.. ఆ తర్వాత విలన్ పాత్రలతో మెప్పించి హీరోగా వెండితెరను ఏలాడు. దాదాపు 40 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అప్పటి నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగాస్టార్ అనే స్థాయికి చేరుకున్నారు. ఎంత ఎదిగినా.. మూలాలు, జ్ఞాపకాలను మార్చిపోకూడదని అంటారు.. ఈ మాటను చిరు ఎప్పటికీ పాటిస్తూనే ఉంటారు. కెరీర్ తొలి నాళ్లల్లో తనకు సినిమా ఆఫర్స్ అందించిన దర్శకనిర్మాతలు.. తనతో కలిసి ప్రయాణం చేసిన నటీనటులను ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. తన సినీ ప్రయాణంలో ఎదురైనా సవాళ్లను, విమర్శలను.. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఇప్పటి యువ నటీనటులకు చెబుతూ వారికి మరింత ప్రోత్సాహం కల్పిస్తుంటారు. తాజాగా ఇన్ స్టాలో చిరంజీవి పోస్ట్ చేసిన స్పెషల్ పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

చిరంజీవి హీరోగా నటించిన తొలి చిత్రం పునాదిరాళ్లు. ఈ మూవీతో వెండితెరకు హీరోగా పరిచయమైన చిరు… డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడే ‘రాజీనామా’ అనే నాటకాన్ని వేశారు. ఈ నాటకానికి గానూ చిరంజీవికి బెస్ట్ యాక్టర్ ఆఫ్ కాలేజీగా అవార్డు వచ్చిందట. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ అప్పుడు తీసుకున్న ఫోటోను షేర్ చేశారు చిరు. అది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

“1974-75 సమయంలో YNM కాలేజీ నర్సపూర్‏లో రంగస్థలం మీద తొలి నాటకం ‘రాజీనామా’. కోన గోవిందరావు గారి రచన నాకు నటుడిగా తొలి గుర్తింపు. అది కూడా బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ రావడం ఎనలేని ప్రోత్సాహం. 50 సంవత్సరాల నట ప్రస్థానం.. ఎనలేని ఆనందం”. అంటూ రాసుకోచ్చారు చిరు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. చిరు త్రోబ్యాక్ ఫోటో చూస్తూ అప్పటికీ.. ఇప్పటికీ చిరులో ఎంతో మార్పు వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇది చదవండి :  Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.