Megastar Chiranjeevi: భూతల స్వర్గంలో కళ్లు చెదిరే అందాలు.. ‘భోళా శంకర్’ నుంచి ఫోటోస్ లీక్ చేసిన చిరంజీవి..

|

May 23, 2023 | 9:33 PM

కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా, కీర్తి సురేష్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. అయితే ఇటీవల ఓ పాట చితీకరణ కోసం చిత్రబృందం భూతల స్వర్గం స్విట్జర్లాండ్ వెళ్లింది. దీనిపై తాజాగా చిరంజీవి అప్డేట్స్ ఇస్తూ.. ఫోటోస్ లీక్ చేశారు.

Megastar Chiranjeevi: భూతల స్వర్గంలో కళ్లు చెదిరే అందాలు.. భోళా శంకర్ నుంచి ఫోటోస్ లీక్ చేసిన చిరంజీవి..
Chiranjeevi
Follow us on

వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా, కీర్తి సురేష్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. అయితే ఇటీవల ఓ పాట చితీకరణ కోసం చిత్రబృందం భూతల స్వర్గం స్విట్జర్లాండ్ వెళ్లింది. దీనిపై తాజాగా చిరంజీవి అప్డేట్స్ ఇస్తూ.. ఫోటోస్ లీక్ చేశారు.

“స్విట్జర్లాండ్ లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట ఎంతో ఆహ్లాదంగా జరిగింది. ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను. త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం.. అప్పటివరకూ ఈ ‘చిరు లీక్స్’ పిక్స్ ” అంటూ లోకేషన్ ఫోటోస్ షేర్ చేశారు. ప్రస్తుతం చిరు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. దీంతో “ఒక సాంగ్ లీక్ చేయండి బాస్ అని ఒకరు”… “బాస్, గేమ్ చేంజర్ సినిమా గ్లింప్స్ లీక్ చేయవా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.