Megastar Chiranjeevi: పూనకాలు లోడింగ్ పాటకు థియేటర్లో చిన్నారి డాన్స్.. ఫిదా అయిన మెగాస్టార్..

|

Jan 15, 2023 | 7:30 PM

అన్నయ్య సినిమా అనంతరం.. మాస్ మహారాజా రవితేజ.. చిరు కలిసి నటించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. వాల్తేరు వీరయ్య చిత్రంతో థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నారు డైరెక్టర్ బాబీ. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

Megastar Chiranjeevi: పూనకాలు లోడింగ్ పాటకు థియేటర్లో చిన్నారి డాన్స్.. ఫిదా అయిన మెగాస్టార్..
Megastar Chiranjeevi
Follow us on

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సక్సెస్‏ఫుల్ గా రన్ అవుతుంది. చాలా కాలం తర్వాత మాస్ అవతారంలో రచ్చ చేశారు చిరు. అలాగే అన్నయ్య సినిమా అనంతరం.. మాస్ మహారాజా రవితేజ.. చిరు కలిసి నటించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. వాల్తేరు వీరయ్య చిత్రంతో థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నారు డైరెక్టర్ బాబీ. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇక సంక్రాంతి సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ భారీగానే వసూళ్లు రాబడుతుంది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. యూట్యూబ్ ను షేక్ చేస్తుండగా.. థియేటర్లలో అభిమానులు డాన్స్ తో రచ్చ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ చూస్తూ ఓ థియేటర్లో నే డాన్స్ చేసింది ఓ చిన్నారి. ఆ పాప డాన్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియో చూసిన చిరు తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

థియేటర్లో పూనకాలు లోడింగ్ పాట చూస్తూ.. కూర్చీపైనే స్టెప్పులతో అదరగొట్టింది ఆ చిన్నారి. ఆ పాప డాన్స్ ను చిరు అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. “ఎంత ఆనందంచ.. ఇలాంటి చిట్టి చిట్టి ఫ్యాన్స్ రాకింగ్.. పూనకాలు లోడింగ్ పాట తదుపరి జనరేషన్ కు కూడా సెట్ అయ్యేలా కనిపిస్తోంది ” అంటూ రాసుకొచ్చారు. ఇక చిన్నారి డాన్స్ చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇందులో చిరు సరసన శ్రుతి హాసన్ నటించగా.. జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఇక శనివారం మెగామాస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.