AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటీటీలోకి మెగాస్టార్ ఎంట్రీ.. బాలయ్యలానే టాక్ షోతో దుమ్ములేపనున్న చిరంజీవి.?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు విశ్వంభర సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకా సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం వీఎఫెక్స్ ఉంటుందని తెలుస్తుంది

ఓటీటీలోకి మెగాస్టార్ ఎంట్రీ.. బాలయ్యలానే టాక్ షోతో దుమ్ములేపనున్న చిరంజీవి.?
Megastar Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Sep 29, 2026 | 10:00 AM

Share

ప్రస్తుతం సినీ ప్రేక్షకుల వినోదానికి థియేటర్లు మాత్రమే వేదికగా ఉండటం లేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు, టాక్‌ షోలు, రియాలిటీ కార్యక్రమాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాయి. దీంతో వెండితెరపై స్టార్ హీరోలుగా కొనసాగుతున్న పలువురు ప్రముఖులు డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్ర కథానాయకులు ఓటీటీ వేదికలపై తమదైన ముద్ర వేయగా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తోంది. చిరంజీవిని ఓటీటీ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఓ ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ఆసక్తి చూపిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆయనతో ప్రత్యేకమైన టాక్ షో నిర్వహించేందుకు సదరు ఓటీటీ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిరంజీవితో ఇప్పటికే  చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

అబ్బా..! ఆ సినిమా నేను చేయాల్సింది.. కానీ ఆమెకు వెళ్ళిపోయింది.. చాలా బాధ పడ్డా

అయితే ఈ చర్చలు కొలిక్కి వస్తే త్వరలోనే ఈ ఓటీటీ షోకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఓటీటీ వేదికలపై అగ్ర హీరోలు కనిపించడం ఇప్పుడు కొత్త విషయమేమీ కాదు. బాలకృష్ణ ఇప్పటికే అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే టాక్ షోతో డిజిటల్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మరోవైపు వెంకటేశ్‌ రానా నాయుడు వెబ్‌సిరీస్‌తో ఓటీటీ వరల్డ్ లోకి అడుగుపెట్టారు. మరో వైపు నాగార్జున బిగ్ బాస్ గేమ్ షోతో అటు టీవీ ఇటు ఓటీటీలోనూ దూసుకుపోతున్నారు. దీంతో తమ అభిమాన హీరోలను డిజిటల్ వేదికలపై చూడాలనుకునే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోనే  మెగాస్టార్ చిరంజీవి కూడా ఓటీటీ కోసం ప్రత్యేకమైన టాక్ షో చేయనున్నారని ప్రచారం జరుగుతుంది.

నేను చెప్పాలనుకుంది ఒకటి.. వాళ్లకు అర్ధమైంది ఇంకొకటి..! కయాదు సీన్‌పై డైరెక్టర్ క్లారిటీ.!

చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న కాకా చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇదే సమయంలో దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ విశ్వంభర కూడా చిరంజీవి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

సినిమా టైటిల్ ఇలా మార్చాల్సిందే.. స్టార్ హీరోకు చుక్కలు చూపించిన శ్రీదేవి.. చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
Vida Dirt.E K3 కొత్త లిమిటెడ్ ఎడిషన్​.. ప్రత్యేకతలివే
Vida Dirt.E K3 కొత్త లిమిటెడ్ ఎడిషన్​.. ప్రత్యేకతలివే
తగ్గుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..
తగ్గుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..
కొత్త Renault Duster హైబ్రిడ్.. మైలేజీ తెలిస్తే షాక్
కొత్త Renault Duster హైబ్రిడ్.. మైలేజీ తెలిస్తే షాక్
రాయల్​ ఎన్​ఫీల్డ్ లవర్స్‌కి సూపర్​ సర్‌‌ప్రైజ్
రాయల్​ ఎన్​ఫీల్డ్ లవర్స్‌కి సూపర్​ సర్‌‌ప్రైజ్
ల్యాప్​టాప్​, ఫోన్​ రెండింటికీ ఒకేసారి కనెక్ట్​ చేసే ఇయర్​బడ్స్‌
ల్యాప్​టాప్​, ఫోన్​ రెండింటికీ ఒకేసారి కనెక్ట్​ చేసే ఇయర్​బడ్స్‌
రాశిఫలాలు: ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాల్లో వీరికి గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాల్లో వీరికి గుడ్‌న్యూస్
స్మృతి మంధాన రికార్డును బద్దలు కొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్..!
స్మృతి మంధాన రికార్డును బద్దలు కొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్..!
క్రిస్పీ ఆలూ బోండా.. అప్పటికప్పుడు స్ట్రీట్ స్టైల్ రుచి
క్రిస్పీ ఆలూ బోండా.. అప్పటికప్పుడు స్ట్రీట్ స్టైల్ రుచి
60 ఏళ్ల తర్వాత తొలిసారి.. ఆస్ట్రేలియాపై జాన్సెన్ అరుదైన రికార్డ్
60 ఏళ్ల తర్వాత తొలిసారి.. ఆస్ట్రేలియాపై జాన్సెన్ అరుదైన రికార్డ్
92 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం.. జింబాబ్వేతో సిరీస్ క్లీన్‌స్వీప్
92 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం.. జింబాబ్వేతో సిరీస్ క్లీన్‌స్వీప్