Gully Rowdy : స్టేట్ రౌడీ చేతుల మీదుగా గల్లీ రౌడీ ట్రైలర్.. యంగ్ హీరో సినిమాకు మెగాస్టార్ సపోర్ట్..

యంగ్ హీరో సందీప్ కిషన్ హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. స్నేహ గీతం అనే సినిమాతో పరిచయం అయిన సందీప్ కిషన్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు.

Gully Rowdy : స్టేట్ రౌడీ చేతుల మీదుగా గల్లీ రౌడీ ట్రైలర్.. యంగ్ హీరో సినిమాకు మెగాస్టార్ సపోర్ట్..
Sandeep Kishan
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 10, 2021 | 11:26 AM

Gully Rowdy : యంగ్ హీరో సందీప్ కిషన్ హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ‘స్నేహ గీతం’ అనే సినిమాతో పరిచయం అయిన సందీప్ కిషన్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. అయితే ‘ప్రస్థానం’ సినిమా సందీప్ కెరీర్‌‌లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో సందీప్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమాలో శర్వానంద్ మెయిన్ హీరోగా నటించగా సందీప్ కిషన్ సెకండ్ హీరోగా చేశాడు. ఆ తర్వాత సోలో హీరోగా చాలా సినిమాల్లో నటించాడు ఈ కుర్రహీరో.. అయితే సందీప్ కిషన్ హిట్ కోసం చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు గల్లీ రౌడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 17వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్.

గల్లీ రౌడీ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదల చేయనున్నారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5:04 నిమిషాలకు ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ‘గల్లీ రౌడీ’ ట్రైలర్‌ను లాంచ్ చేయనున్న ‘స్టేట్ రౌడీ’ అంటూ ఎనౌన్స్ మెంట్ పోస్టర్‌ను వదిలారు. సందీప్ కిషన్ జోడీగా నేహా శెట్టి  ఈ సినిమాతో పరిచయమవుతోంది. రాజేంద్రప్రసాద్ .. వెన్నెల కిషోర్ … పోసాని కృష్ణమురళి.. బాబీ సింహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా విజయం పై ధీమాగా ఉన్నారు చిత్రబృందం. మరి గల్లీరౌడీ సినిమా ఈ యంగ్ హీరోకు ఏ రేంజ్ సక్సెస్ అందిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Bigg Boss 5 Telugu: ఆమె చాలా ఓవర్ హైపర్‌గా ఉంటుంది.. అయినా నామినేట్ చేయలేక పోయా.. అసలు కారణం చెప్పిన షణ్ముఖ్..

Vidyullekha Raman: ఫిట్​నెస్​ నిపుణుడుతో పరిచయం, ప్రేమ, పెళ్లి.. లేడీ కమెడియన్ మ్యారేజ్ ఫోటోలు వైరల్

Bigg Boss 5: బిగ్ బాస్ గేమ్ నాకు నచ్చడం లేదు.. నా వల్లకాదు.. ఓపెన్ అయిన లోబో..