Megastar Chiranjeevi: నా తమ్ముడిని తిట్టిన వాళ్లే నన్ను వేడుకలకు పిలుస్తున్నారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన చిరు..

చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి జనవరి 13న విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఈ ప్రమోషన్లలో పాల్గొన్న చిరు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గురించి.. అలాగే తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Megastar Chiranjeevi: నా తమ్ముడిని తిట్టిన వాళ్లే నన్ను వేడుకలకు పిలుస్తున్నారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన చిరు..
Pawan Kalyan, Chiranjeevi

Updated on: Jan 02, 2023 | 8:21 AM

తన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వస్తోన్న విమర్శలు విని తాను చాలాసార్లు బాధపడ్డానని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తున్న నా తమ్ముడి కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత దూషణకు దిగుతున్నారని.. అవి విని తట్టుకోవడం కష్టంగా ఉంటుందని అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి జనవరి 13న విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఈ ప్రమోషన్లలో పాల్గొన్న చిరు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గురించి.. అలాగే తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

చిరంజీవి మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ నాకు బిడ్డలాంటి వాడు. మా కుటుంబానికి తనకు అమితమైన ప్రేమ. నా చేతులతో తనను పెంచాను. నిస్వార్థపరుడు.. డబ్బు, పదవుల మీద ఎలాంటి వ్యామోహం ఉండదు. నిజం చెప్పాలంటే మొన్నటిదాకా పవన్ కు సొంత ఇల్లు కూడా లేదు. రాజకీయాలను ప్రక్షాళన చేసి ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ రంగంవైపు వచ్చాడు. కానీ ఇక్కడ కొంతమంది తనపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. వాటిని విన్నప్పుడు మనసు చివుక్కుమంటుంది. కానీ పవన్ ను తిట్టినవాళ్లతోనే నేను మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. నా సోదరుడిని తిట్టినవాళ్లే పెళ్లిళ్లు, ఫంక్షన్లకు రమ్మని బ్రతిమిలాడుతుంటారు. “అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే రామ్ చరణ్ ఉపాసన దంపతుల గురించి మాట్లాడుతూ.. చరణ్.. ఉపాసన తల్లిదండ్రులవుతున్నారనే వార్త గతేడాది మా కుటుంబానికి అమితమైన ఆనందాన్ని ఇచ్చింది. ఈ శుభవార్త కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నామని.. ఆర్ఆర్ఆర్ జపాన్ టూర్ పూర్తిచేసుకుని వచ్చాక వాళ్లు ఈ గుడ్ న్యూస్ చెప్పడం కోసం మా ఇంటికి వచ్చారు. ఈ విషయం వినగానే నాకు, సురేఖకు కన్నీళ్లు వచ్చాయి. ఉపాసనకు మూడో నెల వచ్చాక ఈ విషయాన్ని అందరితో చెప్పాం అని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.