Goutham Raju: గౌతమ్‌రాజు కన్నుమూతపై చిరంజీవి దిగ్ర్భాంతి.. ఆయన మరణం సినీ పరిశ్రమకు పెద్ద లోటంటూ..
Goutham Raju Demise: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు(68) మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్వి్టర్ వేదికగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు..
Goutham Raju Demise: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు(68) మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్వి్టర్ వేదికగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘గౌతమ్ రాజు లాంటి గొప్ప ఎడిటర్‌ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన ఎంత సౌమ్యుడో.. ఆయన ఎడిటింగ్ అంత వాడి. ఆయన మితభాషి. కానీ ఆయన ఎడిటింగ్ మెలకువలు అపరిమితం. ఎంత నెమ్మదస్తుడో.. ఆయన ఎడిటింగ్ అంత వేగం. చట్టానికి కళ్లు లేవు చిత్రం నుంచి ఖైదీ నం.150 వరకు నా ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతమ్ రాజు గారు లేకపోవడం వ్యక్తిగతంగా నాకూ, మొత్తం సినీ పరిశ్రమకు పెద్ద లోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు చిరంజీవి.
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 6, 2022
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గౌతమ్ రాజు మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ గొప్ప టెక్నీషియన్ ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న గౌతమ్ రాజు హైదరాబాద్ లోని తన స్వగృహంలో మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. సినిమా ఇండస్ట్రీలో 850 కు పైగా చిత్రాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించిన ఘనత ఆయన సొంతం. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా తన ఎడిటింగ్ వాడిని చూపించారు. తెలుగులో ఖైదీ నెంబర్ 150, గబ్బర్ సింగ్, కాటమరాయుడు, కిక్, రేసుగుర్రం, గోపాలగోపాల, అదుర్స్, బలుపు, రచ్చ, ఊసరవెల్లి, బద్రీనాథ్, మిరపకాయ్, కృష్ట, డాన్ శీను, సౌఖ్యం, డిక్టేటర్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. గౌతమ్ రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్‌రాజు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
Very sad to hear about the demise of the Legendary Editor Sri. Goutham Raju garu ? Had the privilege to work along with him on many memorable movies ? pic.twitter.com/Lc1NbJcLMQ
Saddened at the passing of senior editor #GauthamRaju garu. Deepest condolences to his near and dear ones. May his soul find rest. ? pic.twitter.com/y0zLx9iDNb