Kaikala Satyanarayana Birthday: సతీసమేతంగా ఇంటికి వెళ్లి నవరస నటనా సార్వభౌముడుని విష్ చేసిన మెగాస్టార్

భారతీయ చిత్ర సీమ గర్వించదగిన నటుడు, తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్య నారాయణ పుట్టినరోజు నేడు...

Kaikala Satyanarayana Birthday: సతీసమేతంగా ఇంటికి వెళ్లి నవరస నటనా సార్వభౌముడుని విష్ చేసిన మెగాస్టార్
Megastar Kaikala

Updated on: Jul 25, 2021 | 3:42 PM

భారతీయ చిత్ర సీమ గర్వించదగిన నటుడు, తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్య నారాయణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన్ను నేరుగా విష్ చేసేందుకు చిరంజీవి సతీసమేతంగా కైకాల ఇంటికి వెళ్లారు వెళ్లారు. ఆయనతో పలు విషయాలపై కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ వేసిన ట్వీట్ వైరలవుతుంది. ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు, నాకు అత్యంత ఆప్తులు కైకాల సత్య నారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని,ఈ రోజు నేను, నా సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి కాసేపు ఆయనతో ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’ అని చిరంజీవి ట్వీట్‌లో రాసుకొచ్చారు.

చిరంజీవి ట్వీట్…

చిరంజీవి, కైకాల సత్యనారాయణ చాలా సినిమాల్లో కలిసి నటించారు. విలన్‌గా, తండ్రిగా, మామగా, తాతగా ఇలా ఎన్నో రకాల పాత్రలను చిరంజీవి పక్కన కైకాల పోషించారు. స్టేట్ రౌడీ, కొదమ సింహం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు, బావగారు బాగున్నారా లాంటి బ్లాక్‌బాస్టర్స్ వీరి కాంబినేషన్‌లో వచ్చాయి.  కైకాల, చిరంజీవి చివరగా అందరివాడు చిత్రంలో కలిసి నటించారు.

కాగా మెగాస్టార్ చిరంజీవి పెద్దలపై, తన ఉన్నతికి కారణమైనవారిపై ఎప్పుడూ గౌరవాన్ని ప్రదర్శిస్తార్న విషయం తెలిసిందే. ఆ మధ్య కళాతపస్వి విశ్వనాథ్ జన్మదినం సందర్భంగా కూడా సతీసమేతంగా ఆయన ఇంటికి వెళ్లి  పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.

Also Read:మద్యం షాపుల్లో చోరీ.. ఆ షాపులే టార్గెట్‌గా దోపిడీ.. వారి పనేనా అంటూ వ్యక్తమవుతున్న అనుమానాలు..

వాళ్లు మేక వన్నె పులులు.. ‘ఆంధ్రా ఊటీ’ అరకులో నయా స్మగ్లింగ్ యాంగిల్