
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి నటిస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మ్యాసీవ్ అప్‌డేట్ ఇప్పుడు వచ్చేసింది. ఈ చిత్రంలోని థర్డ్ సింగిల్ ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను రేపు రిలీజ్ చేయనున్నారు.
సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ అదిరిపోయింది. ఎనర్జీతో నిండిన ఈ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఇద్దరూ స్టైలిష్ డాన్స్ పోజుల్లో అదరగొట్టారు. బ్యాక్‌గ్రౌండ్‌లో డ్యాన్సర్లతో కలిసి పూర్తి సెలబ్రేషన్ వైబ్స్‌ను క్రియేట్ చేశారు. డెనిమ్ లుక్, సన్‌గ్లాసెస్‌తో చిరంజీవి మెగా స్వాగ్ తో కనిపిస్తే, రెడ్ జాకెట్‌లో వెంకటేశ్ స్టన్నింగ్‌గా కనిపిస్తున్నారు. ఇద్దరి మాస్ అప్పీల్, స్వాగ్ పీక్స్‌లో ఉన్నాయి.
ఈ సాంగ్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఆంథమ్ గా మ్యూజిక్ చార్ట్స్‌ను షేక్ చేయబోతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ సాంగ్. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. మన శంకర వర ప్రసాద్ గారు జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
Team #ManaShankaraVaraPrasadGaru wishes you all a joyful #MerryChristmas ❤️🔥
Brace yourself for the #MegaVictoryMass SONG UPDATE TOMORROW 🔥#MSG GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY 💥
Megastar @KChiruTweets
Victory @VenkyMama@AnilRavipudi #Nayanthara… pic.twitter.com/BnXxjDsdpX— Gold Box Entertainments (@GoldBoxEnt) December 25, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.