మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య (Acharya ). ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్రలో నటిస్తో్న్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ మరింత హైప్ క్రియేట్ చేయగా.. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మూవీపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించగా.. సోనూసూద్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి.. చరణ్ కలిసి నటిస్తోన్న ఈ సినిమాను చూసేందుకు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తెలుగు చిత్ర ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆచార్య సినిమా ఎప్పుడెప్పుడూ విడుదలవుతుందా అని ఆత్రుతతో ఉన్న మెగా అభిమానుల ముందుకు ఈ మూవీ ఏప్రిల్ 29న రానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ సందర్బంగా ఏప్రిల్ 23న హైదరాబాద్ యూసఫ్ గూడలోని టీఎస్పీఎస్సీ 1వ బెటాలియన్ మైదానంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు… ఈ క్రమంలోనే యూసఫ్ గూడ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా… ఇప్పటికే పోలీసులు ట్రాపిక్ ఆంక్షలు విధించారు. ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకను టీవీ9 తెలుగులో ప్రత్యేక్ష ప్రసారంలో వీక్షించండి..
ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Jeevitha Rajasekhar: తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం ఉంది.. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..
Singer Sunitha: గుడ్ న్యూస్ షేర్ చేసిన సింగర్ సునీత.. Blessed అంటూ..
S Janaki Birthday: ఐదుతరాల హీరోయిన్లకు ఆలంబన జానకమ్మ స్వరం.. గానకోకిల పుట్టిన రోజు నేడు..
Viral Photo: ఇంద్రలోకంలో అలిగినట్లుంది.. భువిపైకి వచ్చింది ఈ సుకుమారి.. ఎవరో గుర్తించారా..?