Megastar Chiranjeevi: అల్లు స్టూడియోస్ ప్రారంభించిన చిరంజీవి.. అల్లు అర్జున్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మెగాస్టార్..

|

Oct 01, 2022 | 1:09 PM

గండిపేటలోని దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో అల్లు స్టూడియోస్ నిర్మించారు నిర్మాత అల్లు అరవింద్. శనివారం (అక్టోబర్ 30న) ఈ స్టూడియోస్ మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు.

Megastar Chiranjeevi: అల్లు స్టూడియోస్ ప్రారంభించిన చిరంజీవి.. అల్లు అర్జున్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మెగాస్టార్..
Megastar Chiranjeevi In All
Follow us on

దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా అల్లు స్టూడియోస్‏ను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. అల్లు అరవింద్ కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో చిరు పాల్గొన్నారు. గండిపేటలోని దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఈ స్టూడియోను నిర్మించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ” అల్లు రామలింగయ్య గారి లాంటి గొప్ప నటులు చాలా అరుదుగా ఉంటారు. ఈ రోజు ఆయన మనవలు అల్లు అర్జున్, శిరీష్, బాబీ సినీ రంగంలో ఉన్నారు అంటే, ఎన్నో దశాబ్దాల ముందు అల్లు రామలింగయ్య గారు వేసిన పునాది మాత్రమే. అప్పట్లో ఆయనకు మద్రాస్ వెళ్ళాలనే ఆలోచనే, ఈ రోజు వీళ్ళందరికీ ఒక బాటను నిర్మించారు. అల్లు అరవింద్ గారు ఈ స్టూడియో ఎదో లాభాపేక్షతో నిర్మించలేదు. అల్లు అరవింద్‏ను నిర్మాతను చేయాలని గీతా ఆర్ట్స్ స్థాపించి సినీరంగంలో ఓ మార్గం చూపించారు. రాబోయే తరాలకు అల్లు రామలింగయ్యను తలుచుకునేందుకు ఇప్పుడు ఆయన పేరు మీద స్టూడియోస్ నిర్మించారని భావిస్తున్నాను. ఆయన కుటుంబంలో నేను భాగం కావడం సంతోషంగా ఫీలవుతున్నాను. మీతో ఇంకా మాట్లాడాలని ఉంది. కానీ ఈ రోజు మధ్యాహ్నం ముంబైలో సల్మాన్ ఖాన్‏తో కలిసి గాడ్ ఫాదర్ ప్రమోషన్స్‏లో పాల్గొన్నవలసి ఉంది. మళ్లీ మీ అందరితో మాట్లాడుతా. ” అని అన్నారు చిరు.

ఇక అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ” ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారికి మా ఫ్యామిలీ తరుపున ధన్యవాదాలు. ఈ స్టూడియోస్ పెట్టడానికి ముఖ్య కారణం.. ఇది మా తాత గారి కోరిక. మనకి కూడా ఒక స్టూడియో ఉండాలి అనేది. ఆయన జ్ఞాపకార్థమై ఈ స్టూడియో స్థాపించడం జరిగింది. మా తాతగారు చనిపోయి 18 ఏళ్లయినా.. మా నాన్నగారికి వారిపై ప్రేమ పెరుగుతోంది. నాపై అభిమానాన్ని చూపిస్తున్న మెగాభిమానులకు.. నా ఆర్మీకి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీసులకు కృతజ్ఞతలు” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “ఒక స్టూడియో ఎంత లాభం వస్తుంది అనే దృక్పథంతో ఎవరు కట్టరు. కానీ, అది ఒక ఆస్తి, ఒక అవసరం. నేను సాధించింది చాలా ఉంది. ఇంకా ఎదో సాధించాలి అనే ఆలోచన నాకు లేదు. గీత ఆర్ట్స్, ఆహా ఇంకా ఇలాంటివి ఎన్నో స్థాపించాను. ఇవన్నీ నా కుమారులకు అందిస్తున్నాను. అల్లు స్టూడియో అనేది ఓ జ్ఞాపిక మాత్రమే ” అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.