Varun Tej – Lavanya Tripathi: వరుణ్-లావణ్యల ముద్దుల కుమారుడిని చూశారా? మనవడిని చూసి మురిసిపోయిన మెగాస్టార్

ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది.స్టార్ కపుల్ వరుణ్‌ తేజ్ - లావణ్య త్రిపాఠి దంప‌తులు అమ్మనాన్నలుగా ప్రమోషన్ పొందారు. బుధవారం (సెప్టెంబర్ 10) లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా, అల్లు కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

Varun Tej – Lavanya Tripathi: వరుణ్-లావణ్యల ముద్దుల కుమారుడిని చూశారా? మనవడిని చూసి మురిసిపోయిన మెగాస్టార్
Chiranjeevi

Updated on: Sep 10, 2025 | 5:51 PM

మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగి తేలుతోంది. వరుణ్‌ తేజ్ – లావణ్య త్రిపాఠి దంప‌తులు అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. బుధవారం (సెప్టెంబర్ 10) ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు వరుణ్ తేజ్. దీంతో ఈ జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ విష‌యం తెలుసుకున్న‌ చిరంజీవి కూడా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సెట్స్‌ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్‌, లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపారు. మ‌న‌వడిని చేతుల్లోకి తీసుకుని లాలించారు. అనంతరం ఈ ఫొటోని ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

‘ఈ ప్రపంచానికి స్వాగతం మై లిటిల్‌ వన్‌. కొణిదెల కుటుంబంలో పుట్టిన బేబికి హృదయపూర్వక స్వాగతం. అలాగే తల్లిదండ్రులుగా ప్రమోట్‌ అయిన వరుణ్‌ తేజ్–లావణ్య త్రిపాఠిలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలుజ నాగబాబు, పద్మజలు తాత–నానమ్మలుగా పదోన్నతి పొందడం చాలా సంతోషంగా ఉంది.. ఆ బిడ్డ అన్ని రకాల ఆనందం, మంచి ఆనందం, ఆరోగ్యం, సమృద్ధిగా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా బిడ్డను ఉండాలని ఆశిస్తున్నాం’ అంటూ చిరంజీవి రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మనవడితో మెగాస్టార్ చిరంజీవి..

ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. మెగాభిమానులు ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. అలాగే వరుణ్- లావణ్యలకు అభినందనలు తెలుపుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .