Nithiin Check Movie : నితిన్ ‘చెక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఆ మెగాహీరో..

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా  చేస్తున్నాడు. అలాగే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ అనే సినిమా చేస్తున్నాడు నితిన్

Nithiin Check Movie : నితిన్ 'చెక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఆ మెగాహీరో..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 21, 2021 | 7:44 AM

Check Movie : యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా  చేస్తున్నాడు. అలాగే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ‘చెక్’ అనే సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ , ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 26న రిలీజవుతోంది. మరణశిక్షను ఎదుర్కొంటున్న ఖైదీ ఆదిత్య పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. ఈ సినిమా 80శాతం జైలు వాతావరణంలోనే సాగుతుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరగనుంది. ఈ వేడుకు మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నాడు. ఇక ‘భీష్మ’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నితిన్  డిఫరెంట్ కథాంశంతో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా నే ఏర్పడ్డాయి. పైగా విడుదలైన పోస్టర్లు , టీజర్ సినిమా ఆసక్తిని పెంచాయి. కల్యాణి మాలిక్ సంగీతం సమకూర్చారు. మంచి పేరు తో పాటు కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తుందని చిత్రయూనిట్ ఆశిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan Ali : మళ్ళీ కలిసిన బెస్ట్ ఫ్రెండ్స్..! ఓ వివాహ వేడుకలో కలిసిన పవన్ కళ్యాణ్.. అలీ\

Mumaith Khan : ఆ స్టార్ హీరో మూవీ షూటింగ్‌‌‌‌లో గాయపడిన ముమైత్ ఖాన్… 15 రోజులపాటు కోమాలో ఉన్న హాట్ బ్యూటీ..