Nandamuri Balakrishna : ‘ఉప్పెన’ సినిమా పై ప్రశంసలు కురిపించిన నట సింహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

కరోనా కష్టకాలం తరవాత విడుదలైన సినిమాల్లో అందమైన ప్రేమ కథగా తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా 'ఉప్పెన'. ఈ సినిమా ద్వారా మెగా కాంపౌండ్ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు...

Nandamuri Balakrishna : 'ఉప్పెన' సినిమా పై ప్రశంసలు కురిపించిన నట సింహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 21, 2021 | 8:15 AM

Balakrishna : కరోనా కష్టకాలం తరవాత విడుదలైన సినిమాల్లో అందమైన ప్రేమ కథగా తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా ‘ఉప్పెన’. ఈ సినిమా ద్వారా మెగా కాంపౌండ్ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. టాప్ డైరెక్టర్ సుకుమార్ ప్రియశిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఉప్పెన చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ నిర్మించాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.అంతే కాదు రికార్డు స్థాయిలో కలక్షన్స్ ను వసులు చేస్తుంది. ఫిబ్రవరి 12న విడుదలైన ఉప్పెన ఇప్పటివరకు  70 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా పై సినిమాతారలు, క్రిటిక్స్ అందరు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ సినిమాను నట సింహం నందమూరి బాలకృష్ణ చూసారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్,మెగాస్టార్ చిరంజీవి మరికొంతమంది సెలబ్రిటీలు ‘ఉప్పెన’ పై ప్రశంసలు కురిపించారు. తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ త‌న కుటుంబంతో క‌లిసి ఉప్పెన సినిమాను వీక్షించారు. సినిమా చాలా బాగుంద‌ని చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో బాలయ్య దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే ఉప్పెన సినిమాతో బుచ్చి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు. చాలా మంది హీరోలు ఇప్పుడు బుచ్చి బాబు తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక బాలయ్య ప్రస్తుతం బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నారు. ఆతర్వాత మైత్రిమూవీస్ మేకర్స్ తో ఓ సినిమా చేయబోతున్నారని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mumaith Khan : ఆ స్టార్ హీరో మూవీ షూటింగ్‌‌‌‌లో గాయపడిన ముమైత్ ఖాన్… 15 రోజులపాటు కోమాలో ఉన్న హాట్ బ్యూటీ..

Nithiin Check Movie : నితిన్ ‘చెక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఆ మెగాహీరో..

ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..