గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ 16 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో చరణ్ జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. రేపు (మార్చి 27న) చరణ్ బర్త్ డే కావడంతో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు చరణ్ కొత్త సినిమాలు, అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నెట్టింట చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు మెగా అభిమానులు. ఇదిలా ఉంటే.. తాజాగా చరణ్ పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
గతంలో ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన చరణ్.. తనకు ఇష్టమైన హీరోహీరోయిన్స్ ఎవరనే విషయాలను బయటపెట్టారు. ఈ క్రమంలోనే తనకు మగధీర సినిమా అంటే చాలా ఇష్టమని అన్నారు. ఆ తర్వాత ఆరెంజ్, రంగస్థలం సినిమాలు కూడా ఇష్టమని అన్నారు. కానీ మగధీర మాత్రం తన ల్యాండ్ మార్క్ అన్నారు. ఇక తనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరి అడగ్గా సమంత అంటే ఇష్టమని అన్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన ఫేవరేట్ హీరో అని అన్నారు.
చరణ్ కు రొమాంటిక్ కంటే యాక్షన్ సినిమాలు ఎక్కువగా ఇష్టం అని అన్నారు. తాను ఎప్పుడూ కామెడీ చేయలేదని.. బుచ్చిబాబుతో కలిసి చేస్తోన్న సినిమా ఈ జానర్ లోనే ఉంటుందని అన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చి బాబు దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కన్నడ హీరో శివన్న కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..