Nagababu’s Son-in-law: అల్లుడికి అదిరిపోయే కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన మెగా బ్రదర్.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో..

| Edited By: Shaik Madar Saheb

Apr 19, 2021 | 6:53 AM

నిహారిక కొణిదెల, వెంకట చైతన్య జొన్నలగడ్డల వివాహం డిసెంబర్ 9న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్

Nagababus Son-in-law: అల్లుడికి అదిరిపోయే కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన మెగా బ్రదర్.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో..
Nagababu
Follow us on

Nagababu’s Son-in-law

నిహారిక కొణిదెల, వెంకట చైతన్య జొన్నలగడ్డల వివాహం డిసెంబర్ 9న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్ హోటల్‌లో నిహారిక, చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ పెళ్లి హడావిడి అంతా ఇంతా కాదు మూడు రోజులు టాలీవుడ్ మొత్తం ఆ పెళ్లిలోనే కనిపించారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మొత్తం చాలా రోజుల తర్వాత నిహారిక పెళ్లిలో సందడి చేసింది. నిహారిక పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. వివాహం అనంతరం పుణ్యక్షేత్రాల్లో పర్యటన, హనీమూన్ అంటూ సరదాగా గడిపింది ఈ జంట.

తాజాగా తన అల్లుడికి మెగాబ్రదర్  నాగబాబు ఓ ఖరీదైన బహుమతిని ఇచ్చారు. నిజానికి ఈ బహుమతి ఉగాది సందర్భంగా ఇవ్వాల్సి వుందని, కానీ కాస్తంత ఆలస్యం అయిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈ బహుమతి ఏంటని అనుకుంటున్నారా? వైట్ కలర్ రేంజ్ రోవర్ కారు. దీని ఖరీదు రూ. 70 లక్షల వరకూ ఉంటుంది. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని, వీడియోను నాగబాబు తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ చిత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

నా ఆరోగ్యం కుదుటపడుతోంది… త్వరలోనే మీ ముందుకు వస్తా.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ లేఖ…

నాకు న్యాయం చేయండి.. సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటుడు నరేష్..

Ishq Movie Pre Release Event: ‘ఇష్క్’ నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ వస్తున్నా తేజ సజ్జ.. ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్…