Tiger Nageswara Rao: బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి తో కలిసి స్టెప్పులేసిన మాస్ రాజా రవితేజ..
ఈ మధ్యకాలంలో ధమాకా సినిమాతో హిట్ అందుకున్నపటికి ఆ తర్వాత వచ్చిన రావణాసుర సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వంశీ. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. రవితేజ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ఈ మధ్యకాలంలో ధమాకా సినిమాతో హిట్ అందుకున్నపటికి ఆ తర్వాత వచ్చిన రావణాసుర సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వంశీ. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనే దొంగ పాత్రలో కనిపించనున్నాడు.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమాను బాలీవుడ్ లోనూ ప్రమోట్ చేస్తున్నారు మూవీ టీమ్. ఈ క్రమంలోనే మూవీ టీమ్ బాలీవుడ్ లో వరుసగా ప్రెస్ మీట్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ లో పలు షోల్లో కూడా పాల్గొంటూ టైగర్ నాగేశ్వరరావు సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శిల్ప శెట్టితో కలిసి డాన్స్ చేశారు మాస్ రాజా రవితేజ. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో పాటకు శిల్పాశెట్టి తో కలిసి డాన్స్ చేశారు రవితేజ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను శిల్పాశెట్టి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
శిల్ప శెట్టి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
Hum toh Ek dum fidaa hain 💃🏻🕺🏻 aur aap? 😉@RaviTeja_offl #InBetweenTakes #setlife #BTS #IGT #happysoul #EkDumEkDumHookStep pic.twitter.com/TyOledMVMW
— SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) October 10, 2023
రవితేజ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..
Absolutely loved meeting you @TheShilpaShetty🤗 and dancing with you for #EkDumEkDumHookStep was Lol hahaha :))) https://t.co/IpjItitslN
— Ravi Teja (@RaviTeja_offl) October 10, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
