Divya Bharti-GV Prakash: మరోసారి ఆకట్టుకోనున్న ‘బ్యాచిలర్’ మూవీ రొమాంటిక్ కపుల్

రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన దివ్య భారతి తన అందంతో కవ్వించింది. రొమాంటిక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ లో నటించి ఆకట్టుకుంది. జీవి ప్రకాష్, దివ్యభారతి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్యాచిలర్ సినిమాలో అడియే అనే సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. ఈ సాంగ్ లో తన గ్లామర్ తో ఆకట్టుకుంది దివ్య భారతి.

Divya Bharti-GV Prakash: మరోసారి ఆకట్టుకోనున్న 'బ్యాచిలర్' మూవీ రొమాంటిక్ కపుల్
Gv Prakash , Divya Bharathi
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 11, 2023 | 10:03 AM

సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలు ప్రేక్షకులను ఎప్పుడు మెప్పిస్తునే ఉంటాయి. సినిమాలు ఫ్లాప్ అయిన కూడా హీరో, హీరోయిన్స్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండి పోతాయి. అలాంటి సినిమాల్లో బ్యాచిలర్ సినిమా ఒకటి. రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన దివ్య భారతి తన అందంతో కవ్వించింది. రొమాంటిక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ లో నటించి ఆకట్టుకుంది. జీవి ప్రకాష్, దివ్యభారతి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్యాచిలర్ సినిమాలో అడియే అనే సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. ఈ సాంగ్ లో తన గ్లామర్ తో ఆకట్టుకుంది దివ్య భారతి. ఇక ఇప్పుడు మరోసారి ఈ జంట కలిసి నటించబోతున్నారు.

జీవీ ప్రకాష్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా కింగ్‌స్టన్ . తాజాగా ఈ మూవీ పోస్టర్ ను  చేశారు. ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా హాట్ బ్యూటీ దివ్యభారతి నటిస్తుంది. ఈ సినిమాను తెలుగు తమిళ్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమా ఫాంటసీ నేపథ్యంలో సాగే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కమల్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నాడు. జీవి ప్రకాష్ హీరోగా నటిస్తూనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

దివ్య భారతి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

దివ్య భారతి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

దివ్య భారతి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.