Trisha-Mansoor Ali Khan: మళ్లీ గొడవ రాజేసిన మన్సూర్‌… త్రిషతో సహా వారిపై కేసులు వేస్తానంటూ సంచలన ప్రకటన

ప్రముఖ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. త్రిషపై అసభ్యకర కామెంట్లు చేసి విమర్శలు ఎదుర్కొన్న ఈ నటుడు రెండు రోజుల క్రితం ఆమెకు నటికి క్షమాపణలు చెప్పాడు. త్రిష కూడా 'తప్పులు చేయడం మానవ సహజం.. వాటిని క్షమించడమే చాలా గొప్ప విషయం' అంటూ ఈ వివాదానికి ముగింపు పలికేలా ట్వీట్‌ చేసింది. అయితే మన్సూర్ మాత్రం ఈ గొడవను మళ్లీ తట్టి లేపుతున్నాడు. త్రిషతో సహా ఆమెకు సపోర్టుగా మాట్లాడిన

Trisha-Mansoor Ali Khan: మళ్లీ గొడవ రాజేసిన మన్సూర్‌... త్రిషతో సహా వారిపై కేసులు వేస్తానంటూ సంచలన ప్రకటన
Mansoor Ali Khan, Trisha

Updated on: Nov 26, 2023 | 4:50 PM

ప్రముఖ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. త్రిషపై అసభ్యకర కామెంట్లు చేసి విమర్శలు ఎదుర్కొన్న ఈ నటుడు రెండు రోజుల క్రితం ఆమెకు నటికి క్షమాపణలు చెప్పాడు. త్రిష కూడా ‘తప్పులు చేయడం మానవ సహజం.. వాటిని క్షమించడమే చాలా గొప్ప విషయం’ అంటూ ఈ వివాదానికి ముగింపు పలికేలా ట్వీట్‌ చేసింది. అయితే మన్సూర్ మాత్రం ఈ గొడవను మళ్లీ తట్టి లేపుతున్నాడు. త్రిషతో సహా ఆమెకు సపోర్టుగా మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బులపై పరువునష్టం దావా వేస్తున్నట్లు తెలిపాడీ సీనియర్‌ నటుడు. ఈ విషయంలో సోమవారం (నవంబర్‌ 27) కోర్టులో క్రిమినల్‌ కేసు కూడా వేస్తున్నట్లు ప్రకటించాడు. త్రిష, చిరంజీవి, ఖుష్బూ ముగ్గురికి నోటీసులు జారీ చేస్తానన్నాడు. త్రిషపై తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని, అదే సమయంలో త్రిష, చిరంజీవి, ఖుష్బూ తదితరులు అవనసరంగా తనపై నోరు పారేసుకున్నారని మన్సూర్‌ చెబుతున్నాడు. వారి వ్యాఖ్యలు తనను మానసికంగా బాధించాయంటున్నారు. అందుకే ఈ విషయమై సోమవారం కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపాడు.

త్రిష, చిరంజీవి, ఖుష్బులపై పరువునష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా, ముందస్తు అల్లర్లు, నగరంలో 10 రోజులపాటు ప్రజా శాంతికి విఘాతం కలిగించడం, ఇతరులను రెచ్చగొట్టడం.. ఇలా అన్ని కేటగిరీల కింద కేసు నమోదు చేయబోతున్నట్లు మన్సూర్ అలీఖాన్ ప్రకటించాడు. తన లాయర్ గురు ధనంజయన్‌ ద్వారా సోమవారం కోర్టులో కేసు వేస్తానంటున్నాడు. కాగా త్రిషపై మన్సూర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులందరూ మన్సూర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. మెగాస్టార్‌ చిరంజీవి, ఆర్కే రోజా, నితిన్‌, లోకేష్‌ కనగరాజ్‌, మాళవికా మోహనన్‌, ఖుష్బూ, సింగర్‌ చిన్మయి ఇలా పలువురు సినీ ప్రముఖులు మన్సూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మహిళా కమిషన్‌ సైతం మన్సూర్‌ కామెంట్స్‌పై స్పందించి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో దిగొచ్చిన మన్సూర్‌ త్రిషకు క్షమాపణలు చెప్పాడు. దీంతో ఈ వివాదం సద్దు మణిగిపోయిందుకున్నారు. ఇప్పుడు మన్సూర్‌ ప్రకటనతో ఈ గొడవ మరో మలుపు తీసుకుంది.

ఇవి కూడా చదవండి

త్రిషకు మద్దతుగా చిరంజీవి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.