యంగ్ టైగర్ సినిమాలో ‘మన్మధుడు’ ముద్దుగుమ్మ.. ఇన్నాళ్ల తర్వాత త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్..
కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సినిమాను ప్రేక్షకులను అంతా సులువుగా మర్చిపోరు. నాగ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచింది ఈ సినిమా...
Jr NTR- Trivikram Film : కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సినిమాను ప్రేక్షకులను అంతా సులువుగా మర్చిపోరు. నాగ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచింది ఈ సినిమా. ఇక ఈ మూవీలో సోనాలి బింద్రే ఒక హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ గా నటించిన భామ అన్షు. ఈ ముద్దుగుమ్మ తన ఇనోసెంట్ నటనతో ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా తర్వాత అన్షు మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. మన్మధుడు కంటే ముందు ప్రభాస్ తో కలిసి ‘రాఘవేంద్ర’ సినిమాలో నటించింది.ఆతర్వాత శివాజి-లయ-భూమిక నటించిన ‘మిస్సమ్మ’లో అతిథిపాత్రలో మెరిసింది. ఈ సినిమాల తర్వాత అన్షు సినిమాలకు దూరం అయ్యింది. కాగా ఇప్పుడు ఈ భామ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘‘అయిననూ పోయిరావలె హస్తినకు’’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో అన్షు నటించనుందని ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో కీలక పాత్ర కోసం అన్షు ను ఎంపిక చేశారట దర్శకుడు త్రివిక్రమ్. ఈ మేరకు త్వరలోనే ఓ ప్రకటన కూడా విడుదల చేస్తారని అంటున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్ త్వరలోనే ఆ సినిమాను పూర్తి చేసి త్రివిక్రమ్ తో చేతులు కలపనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Dr.Rajasekhar : షూటింగ్ మొదలు పెట్టిన సీనియర్ హీరో.. రాజశేఖర్ కెరీర్‌లో 91వ చిత్రంగా ‘శేఖర్’
ప్రేమికుల రోజున ప్రభాస్ సినిమా టీజర్ రాబోతోందా..? ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..