Thalapathy Vijay: దళపతి విజయ్ మీదున్న వీరాభిమానంతో ఈ యువతి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..
దళపతి విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే...
Thalapathy Vijay Fan : దళపతి విజయ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. విజయ్ సినిమా రిలీజ్ రోజు అభిమానుల సందడి మాములుగా ఉండదు. కటౌట్లు , పాలాభిషేకాలు, పూలాభిషేకాలు ఆ హంగామానే వేరు. కాగా ఇటీవల విజయ్ మాస్టర్ సినిమాతో మరో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో విజయ్ కు విలన్ గా నటించారు. ఇక ఈ సినిమా తెలుగులో పర్వాలేదు అనుపించుకున్నా తమిళ్ లో సూపర్ హిట్ గా నిలించింది.
తాజాగా విజయ్ అభిమాని చేసిన ఓ పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఆమె ఎం చేసిందంటే..మాస్టర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే లాక్ డౌన్ కారణంగా మలేషియాలో ఈ సినిమా విడుదల కాలేదు. దాంతో విజయ్ వీరాభిమాని అయిన ఆష్లినా ఎలాగైనా విజయ్ సినిమాను థియేటర్ లో చూడాలని మలేషియా నుంచి చెన్నైకి వచ్చింది. అక్కడ ఒక షో కు సంబంధించిన అన్ని టికెట్స్ ను తానే కొనుగోలు చేసుకుంది. తన స్నేహితులు, కుటుంబసభ్యులతో సినిమా చూసి సంబరపడింది. ఈ అమ్మడికి విజయ్ మీద ఉన్న అభిమానం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
యంగ్ టైగర్ సినిమాలో ‘మన్మధుడు’ ముద్దుగుమ్మ.. ఇన్నాళ్ల తర్వాత త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్..