ప్రేమికుల రోజున ప్రభాస్ సినిమా టీజర్ రాబోతోందా..? ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న సినిమా 'రాధేశ్యామ్'. చాలారోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు..

ప్రేమికుల రోజున ప్రభాస్ సినిమా టీజర్ రాబోతోందా..? ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 04, 2021 | 4:44 PM

Radhe Shyam : ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘రాధేశ్యామ్’. చాలారోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. చిత్రీకరణ కూడా పూర్తి చేసుకోవడంతో సినిమా టీజర్, ట్రైలర్ ఎప్పుడెప్పుడొస్తుందా అనే కుతూహలం అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ త్వరలో రాబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

పిరియాడికల్ డ్రామా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి పలు పోస్టర్లను విడుదల చేశారు. ఈ సినిమాలో తెలుగే కాకుండా బాలీవుడ్ నటులు కూడా నటిస్తుండటంతో.. పాన్ ఇండియా మూవీగా ఐదు బాషలలో విడుదల కాబోతుంది.  అయితే ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల తేదీని ప్రకటించడం లేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాతలను దర్శకులను టీజర్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. తాజాగా ఈ నెలలో వాలంటైన్స్ డే రోజున రాధేశ్యామ్ టీజర్ విడుదలైయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆశిస్తున్నారు. త్వరలోనే చిత్రయూనిట్ ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘ఫిబ్రవరి 14’న రాధేశ్యామ్ టీజర్ ప్రేక్షకులముందుకు వస్తుందో లేదో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

”ప్రేమ గొప్పదైతే చరిత్రలోనూ, సమాధుల్లోనూ కనబడాలి గానీ.. పెళ్లి చేసుకుని..” ఆకట్టుకుంటోన్న ‘ఉప్పెన ట్రైలర్..