Tannishtha : ఆమె రాకతో ‘సైనైడ్’బృందం మరింత బలపడింది.. సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా వస్తున్న పాన్‌ ఇండియా మూవీ..

Tannishtha Chatterjee: విభిన్న దర్శకుడు డైరెక్టర్‌ రాజేశ్‌ టచ్‌రివర్ దర్శకత్వంలో ‘సైనైడ్’మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియమణి, తనికెళ్లభరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా

Tannishtha : ఆమె రాకతో ‘సైనైడ్’బృందం మరింత బలపడింది.. సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా వస్తున్న పాన్‌ ఇండియా మూవీ..
Follow us
uppula Raju

|

Updated on: Feb 04, 2021 | 4:10 PM

Tannishtha Chatterjee: విభిన్న దర్శకుడు డైరెక్టర్‌ రాజేశ్‌ టచ్‌రివర్ దర్శకత్వంలో ‘సైనైడ్’మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియమణి, తనికెళ్లభరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే అంతర్జాతీయ నటి తనిష్టా ఛటర్జీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ప్రదీప్, నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ‘తనిష్టా ఛటర్జీ రాకతో మా ‘సైనైడ్’ బృందం మరింత బలపడిందన్నారు.

ఆమె మా సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సినిమా చిత్రీకరణ ఈ నెల 15న ప్రారంభం కాబోతుందని తెలిపారు. ప్రేమ పేరుతో 20 మంది అమ్మాయిలను నమ్మించి, శారీరకంగా వాడుకొని ‘సైనైడ్’ ఇచ్చి వాళ్ల బంగారు ఆభరణాలతో ఉడాయించే సైనైడ్ మోహన్ కేసు ప్రేరణతో ఈ కథ రూపొందించామని వెల్లడించారు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్ సంగీత దర్శకులు జార్జ్ జోసెఫ్ నేపథ్య సంగీతం, డాక్టర్ గోపాల శంకర్ స్వరాలు అందించనున్నారు.

టాప్ ప్రొడక్షన్‌కు నో చెప్పిన డైనమిక్ డైరెక్టర్.. పాన్ ఇండియా సినిమా రిజెక్ట్.. రతన్ టాటా బయోపిక్‌పైనే ఫోకస్

Kuldeep Yadav: జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న టీం ఇండియా స్పిన్నర్ .. అవకాశం దక్కేనా!