Kuldeep Yadav: జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న టీం ఇండియా స్పిన్నర్ .. అవకాశం దక్కేనా!
Kuldeep Yadav: దాదాపు రెండేళ్ల నుంచి టెస్టు మ్యాచ్ ఆడలేదు... ఇప్పుడు అవకాశం వస్తే మళ్లీ అరంగేట్రంలానే ఉంటుందంటున్నాడు టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్. జీవితంలో వైఫల్యాన్ని చూశానని,
Kuldeep Yadav: దాదాపు రెండేళ్ల నుంచి టెస్టు మ్యాచ్ ఆడలేదు… ఇప్పుడు అవకాశం వస్తే మళ్లీ అరంగేట్రంలానే ఉంటుందంటున్నాడు టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్. జీవితంలో వైఫల్యాన్ని చూశానని, మరోసారి అరంగేట్రం చేస్తున్నానే భావన కలుగుతుందని చెబుతున్నాడు. ప్రస్తుతం అతడు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. ట్వంటీ ట్వంటీ క్రికెట్‌తో పాటు టెస్టుల్లోనూ అవకాశాలు దక్కలేదు. 2019 జనవరిలో సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు ఆడాడు. అయితే అవకాశాలు రాకున్నా బౌలింగ్‌లో మెరుగవ్వడానికి తీవ్రంగా శ్రమిస్తున్నానని పేర్కొన్నాడు.
2020 ఐపీఎల్ సీజన్ కలిసిరాలేదు. ఆ సీజన్‌లో మరికొన్ని మ్యాచ్‌లు ఆడాల్సింది. ఎందుకంటే తాను మంచి ఫామ్‌లో ఉన్నానని చెప్పాడు. బాగానే బౌలింగ్ చేశాను కూడా. కానీ ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం రాలేదని పేర్కొన్నాడు. 2019 సీజన్‌లోనూ అదే పరిస్థితి ఎదురైంది. అయితే విఫలమయ్యే వరకు మనం ఒత్తిడిని జయించలేం. ఇప్పుడు ఆ విషయాలన్నీ బాగా అర్థం చేసుకున్నానని చెబుతున్నాడు. తన జీవితంలో ఫెయిల్యూర్‌ను చూసేశా. ఇక తాను మంచి ప్రదర్శన చేయకపోయినా అది కొత్త విషయమేమి కాదని పేర్కొన్నాడు. కానీ కఠోర సాధన చేస్తే తప్పక విజయం సాధించగలం అని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.