Gwadar Cricket Stadium: నిర్మాణ దశలో ప్రపంచంలోనే అత్యంత అందమైన క్రికెట్ స్టేడియం, ఫోటోలను షేర్ చేసిన ఐసీసీ

క్రికెట్ ప్రియులకు ఐసీసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన క్రికెట్ స్టేడియం సిద్ధం అవుతోందని ఐసీసీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇప్పుడు ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. క్రికెట్ స్టేడియం లలో..

Gwadar Cricket Stadium: నిర్మాణ దశలో ప్రపంచంలోనే అత్యంత అందమైన క్రికెట్ స్టేడియం, ఫోటోలను షేర్ చేసిన  ఐసీసీ
Follow us
Surya Kala

|

Updated on: Feb 04, 2021 | 4:22 PM

Gwadar Cricket Stadium: క్రికెట్ ప్రియులకు ఐసీసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన క్రికెట్ స్టేడియం సిద్ధం అవుతోందని ఐసీసీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇప్పుడు ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. క్రికెట్ స్టేడియం లలో అందమైన స్టేడియం ఏదని క్రికెట్ ఫ్యాన్స్‌ను అడిగితే ఏం చెబుతారు? ఒక్కొక్కరు ఒక్కో స్టేడియం పేరు చెబుతారు. ఎక్కువ మంది లార్డ్స్ అని చెబుతారు. అలాగే కొంతమంది కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్.. మరికొందరు హిమాలయాల దగ్గరలోని ధర్మశాల అని చెబుతారు.  ఆయితే వీటన్నిటి కంటే మరింత అందమైన క్రికెట్ స్టేడియం ను ఐసిసి రెడీ చేస్తోంది.

ఇండియాకు పొరుగునే ఉన్న బెలూచిస్థాన్ లో గ్వాదర్ క్రికెట్ స్టేడియంను ఐసీసీ నిర్మిస్తుంది. తాజాగా ఈ స్టేడియంకు సంబంధించిన ఫోటోలు ఐసీసీ ట్వీట్ చేసింది. ఈ గ్రౌండ్ కన్నా మరింత అందంగా కనిపించే చిత్రమేదైనా ఉంటే చూద్దాం అని కామెంట్‌ పెట్టింది. అంతే… ఈ ట్వీట్ జెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్లింది. నిజంగానే ఇది అత్యంత అందమైన స్టేడియం” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒకవైపు ఎత్తైన పర్వతం, మరోవైపు నగరం, ఇంకోవైపు ఖాళీ స్థలంతో ఉన్న గ్వాదర్ క్రికెట్ స్టేడియం ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. నిర్మాణ దశలోనే ఇంత పేరు సంపాదించిన ఈ స్టేడియం పూర్తయ్యేసరికి ఇంకెంత సుందరంగా ముస్తాబవుతుందో అని క్రికెట్ అభిమానులు అంటున్నారు.

ఇక దీనిపై స్పందించిన పాక్ దిగ్గజ క్రికెటర్ వసీమ్ అక్రమ్, వరల్డ్ బ్యూటిఫుల్ క్రికెట్ గ్రౌండ్స్ లో ఇది కూడా ఒకటిగా నిలిచి తీరుతుందని కితాబునిచ్చారు. ఒకవైపు ఎత్తయిన పర్వతం, మరోవైపు నగరం, ఇంకోవైపు ఖాళీ స్థలంతో ఉన్న గ్వాదర్ క్రికెట్ స్టేడియం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా, భవిష్యత్తులో మరింకెంత అందంగా మారుతుందో చూడాలి మరి.

Also Read:

ఐపీఎల్​లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు టైటిల్​స్పాన్సర్‌గా ‘స్కోడా’..

జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న టీం ఇండియా స్పిన్నర్ .. అవకాశం దక్కేనా!