AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెలూచిస్తాన్ లోని గ్వాడార్ లో చైనా సైనిక స్థావర నిర్మాణం, యాక్టివిస్టుల ఆందోళన, మీడియా సైతం అభ్యంతరం,

బెలూచిస్తాన్ లోని గ్వాడార్ సిటీలో పాకిస్తాన్, చైనా దేశాలు కలిసికట్టుగా ఓ సైనిక స్థావరాన్ని నిర్మిస్తున్నాయి. 10 అడుగుల ఎత్తుతో గోడ నిర్మాణంతో బాటు 30 కిలోమీటర్ల దూరం పొడవునా కంచెను కూడా ఏర్పాటు చేస్తున్నాయి.

బెలూచిస్తాన్ లోని గ్వాడార్ లో చైనా సైనిక స్థావర నిర్మాణం, యాక్టివిస్టుల ఆందోళన, మీడియా సైతం  అభ్యంతరం,
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 24, 2020 | 10:39 AM

Share

బెలూచిస్తాన్ లోని గ్వాడార్ సిటీలో పాకిస్తాన్, చైనా దేశాలు కలిసికట్టుగా ఓ సైనిక స్థావరాన్ని నిర్మిస్తున్నాయి. 10 అడుగుల ఎత్తుతో గోడ నిర్మాణంతో బాటు 30 కిలోమీటర్ల దూరం పొడవునా కంచెను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ స్థావరానికి కేవలం రెండు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు మాత్రమే నిర్దేశించారు. తమను ఈ సిటీలోకి రాకుండా చూసేందుకు, తమ రాకపోకలపై ఆంక్షలు విధించేందుకు అక్రమంగా దీన్ని నిర్మిస్తున్నారని మానవహక్కుల  కార్యకర్తలు, యాక్టివిస్టులు ఆందోళన చెందుతున్నారు. బెలూచిస్థాన్ లో జరుగుతున్న పాక్ ఆర్మీ అకృత్యాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఉదంతాలు  బయటి ఫ్రపంచానికి తెలియకుండాఉండేందుకు చేస్తున్న ప్రయత్నమే ఇదని  మీడియా సంస్థలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పైగా వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టేందుకు 500 హైపవర్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది.

పాకిస్తాన్ నుంచి 15 వేల మంది, చైనా నుంచి 6 వేల మంది సైనికులు గ్వాడార్ లో మోహరించి ఉన్నారు. ఈ మిలిటరీ బేస్ ను నిర్మిస్తున్న చైనా వర్కర్లకు వీళ్ళు సెక్యూరిటీని కల్పిస్తున్నారు. తమ ఫైటర్ జెట్లను, వార్ షిప్స్ కోసం ఇక్కడి రేవును, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వినియోగించుకునేందుకు పకడ్బందీగా ప్లాన్  చేస్తున్నారని సమాచారం. ఈ బేస్ పొడవునా త్వరలో చైనా సోల్జర్స్ ని నియమిస్తారట.

Follow Us
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్