టాప్ ప్రొడక్షన్‌కు నో చెప్పిన డైనమిక్ డైరెక్టర్.. పాన్ ఇండియా సినిమా రిజెక్ట్.. రతన్ టాటా బయోపిక్‌పైనే ఫోకస్

సుధా కొంగ‌ర సినిమాల్లో ఒక కొత్తదనం ఉంటుంది. రొటీన్ కు భిన్నంగా ఈమె సినిమాలు తీస్తారు. ఆమె డైరెక్షన్ లో మూవీస్ ను నిర్మించేందకు చాలా సంస్థలు క్యూ కడుతున్నాయి.

టాప్ ప్రొడక్షన్‌కు నో చెప్పిన డైనమిక్ డైరెక్టర్.. పాన్ ఇండియా సినిమా రిజెక్ట్.. రతన్ టాటా బయోపిక్‌పైనే ఫోకస్
Follow us
Anil kumar poka

| Edited By: Rajesh Sharma

Updated on: Dec 09, 2020 | 2:59 PM

Female director Sudha Kongara rejects offer: ఆకాశమే నీ హద్దురా సినిమాతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న డైనమిక్ డైరెక్టర్ సుధ కొంగర గురించే ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ. ఈ లేడీ డైరెక్టర్ కు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. సుధా కొంగ‌ర సినిమాల్లో ఒక కొత్తదనం ఉంటుంది. రొటీన్ కు భిన్నంగా ఈమె సినిమాలు తీస్తారు. ఆమె డైరెక్షన్ లో మూవీస్ ను నిర్మించేందకు చాలా సంస్థలు క్యూ కడుతున్నాయి. తెలుగు నిర్మాణ సంస్థలు ఇలాంటి కొత్తదనం దర్శకులతో సినిమాలు తీయాలని ఆరాటపడుతుంటాయి. అందుకే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ తమకు ఓ సినిమా చేయాల‌ని సుధాకొంగ‌ర‌ను సంప్రదించిదట. ఒక పాన్ ఇండియా సినిమాను చేద్దాం అన్నారట. మైత్రీ మూవీమేక‌ర్స్ కు సినీ ఇండస్ట్రీలో మంచి పేరుంది. అయితే ఈ సంస్థ ఆఫ‌ర్ ను సున్నితంగా తిర‌స్కరించారట సుధా కొంగ‌ర. లైకా ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్ లో ఈమె ఓ సినిమా చేస్తున్నారు. రతన్ టాటా బయోపిక్ పై సినిమా తీస్తున్నట్లు టాక్ వస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో పాటు అజిత్ కూడా ఆమెతో వర్క్ చేయడానికీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇంకా చాలా ప్రాజెక్టుల‌ను కూడా ఆమె కోసం క్యూలో ఉన్నాయట.