సాయికుమార్‌కు సలహా మాత్రమే ఇచ్చా.. ఆ హీరోకు ‘మా’ గొడవకు సంబంధం లేదన్న సుమన్..గత వైరంపై క్లారిటీ.
హీరో సుమన్, సాయికుమార్‌కు మధ్య తారాస్థాయి గొడవలు జరిగినట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి. అయితే ఆ రూమర్స్ పై సుమన్ తాజాగా అలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
Latest Tollywood News: హీరో సుమన్, సాయికుమార్‌కు మధ్య తారాస్థాయి గొడవలు జరిగినట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి. అయితే ఆ రూమర్స్ పై సుమన్ తాజాగా అలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తనకు సాయి కుమార్‌కు ఎలాంటి గొడవలు జరగలేదని చెప్పారు. ఈ విషయాలపై ఆయన మాట్లాడుతూ.. నిజానికి నాకు ఒక విధంగా లైఫ్ ఇచ్చింది సాయి కుమార్ మాత్రమే. అలాంటిది అతనితో గొడవ అనేది ఎప్పుడు జరగలేదు. ఒకరికి డబ్బింగ్ చెప్పోద్దని నేనేప్పుడు అనలేదు. కాకపోతే ఒక చిన్న సలహా మాత్రం ఇచ్చాను. ఒక స్థాయి నటులకు డబ్బింగ్ చెప్పి నీ స్థాయి తగ్గించుకోకు అని మాత్రమే చెప్పాను. అయిన అది సాయి ఇష్టం. అయితే నేను సలహా మాత్రమే ఇచ్చాను గొడవ పడలేదు అంటూ సుమన్ వివరణ ఇచ్చారు.