ఆ స్టార్ హీరో సినిమా వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. నన్ను ఎవరు పట్టించుకోవడం.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

రజినీకాంత్ ఏడు పదుల వయసులోనూ సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా కూలీ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు రజిని. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా .. కలెక్షన్స్ మాత్రం భారీగా రాబట్టింది. ఇక ఇప్పుడు జైలర్ 2లో నటిస్తున్నారు సూపర్ స్టార్..

ఆ స్టార్ హీరో సినిమా వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. నన్ను ఎవరు పట్టించుకోవడం.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
Actress

Updated on: Aug 29, 2025 | 8:55 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. 70 పదుల వయసులోనూ రజినీకాంత్ సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. రీసెంట్ గా కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు జైలర్ 2 సినిమాలో నటిస్తున్నారు సూపర్ స్టార్.. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ గా జరుగుతుంది. ఇదిలా ఉంటే రజినీకాంత్ తో సినిమా చేయడం వల్ల నా జీవితం నాశనం అయ్యిందని ఓ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. పైగా ఆమె చిన్న హీరోయిన్ కూడా కాదు ఆమె ఓ స్టార్ హీరోయిన్.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది ఆమె. ఇంతకూ అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిందో తెలుసా.?

పెట్టింది రూ. 5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు.. ఇప్పటికీ ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో మనీషా కొయిరాలా ఒకరు. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఎంతో మంది అభిమాన హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఈ క్రేజీ బ్యూటీ.. భారతీయుడు, ఒకే ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో మనీషా కొయిరాలా పేరు తెలుగులోనూ మారు మ్రోగిపోయింది. కెరీర్ పీక్ లో ఉండగానే ఈ చిన్నది క్యాన్సర్ బారిన పడింది. క్యాన్సర్ తో పోరాడి జయించింది మనీష..

ఇవి కూడా చదవండి

ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఈ సీనియర్ హీరోయిన్ భర్త టాలీవుడ్ హీరోనా..!! ఏ ఏ సినిమాలు చేశాడంటే 

ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అడపాదడపా సినిమాలు చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనీషా కొయిరాలా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వల్ల తన కెరీర్ నాశనం అయ్యిందని తెలిపింది. రజినీకాంత్ తో కలిసి బాబా సినిమాలో నటించింది మనీషా కొయిరాలా. అయితే బాబా సినిమా కారణంగా చాలా నష్టపోయాను అని తెలిపింది. బాబా సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయ్యింది. బాబా సినిమా ఫ్లాప్ అవ్వడంతో తనకు సౌత్ నుంచి ఆఫర్స్ తగ్గిపోయాయి అని తెలిపింది. బాబా కు ముందు సౌత్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి.. కానీ బాబా తర్వాత ఆఫర్స్ రాలేదు అని తెలిపింది మనీషా కొయిరాలా. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.

వర్త్ వర్మ వర్త్..! అప్పుడు క్యూట్ హీరోయిన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. 42ఏళ్ల వయసులోనూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి