Pawan Kalyan: క్రెడిట్ అంతా పవన్ దే.. గుడుంబా శంకర్ మూవీ మ్యూజిక్ కోసం పవర్ స్టార్ ఏం చేశారంటే
ఆయనను దేవుడిగా కొలిచే భక్తులు కూడా ఉన్నారు. ఆయన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకుంటాయి. ఇక పవన్ సినిమాల్లో మ్యూజిక్ పెద్ద హిట్ అవుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్టైల్ కు యాటిట్యూడ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయనను దేవుడిగా కొలిచే భక్తులు కూడా ఉన్నారు. ఆయన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకుంటాయి. ఇక పవన్ సినిమాల్లో మ్యూజిక్ పెద్ద హిట్ అవుతుంది. ఆయన సినిమాల్లో పాటలన్ని హిట్ అవుతుంటాయి. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సాంగ్స్ సూపర్ సక్సెస్ అవుతుంటాయి. ఇక పవన్ క్రేజ్ ను పెంచిన సినిమాల్లో గుడుంబా శంకర్ సినిమా ఒకటి. 2004లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ మూవీలో పవన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక గుడుంబా శన్కర్ సినిమాలోని పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మణిశర్మ అందించిన ఈ మూవీ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికి ఈ పాటలకే క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఈ మూవీ సంగీతం గురించి మణిశర్మ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తన కెరీర్లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన ఆల్బమ్స్ లో బెస్ట్ ఆల్బమ్ గుడుంబా శంకర్ అని అన్నారు మణిశర్మ. ఈ సినిమా సాంగ్స్ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ దే అన్నారు మణి. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారని తెలిపారు మణిశర్మ. ఈ సినిమా మ్యూజిక్ హిట్ అవవడం కోసం పవన్ చాలా కష్టపడ్డారని.. డే అండ్ నైట్ రికార్డింగ్ రూమ్ లో కూర్చొని చిన్న చిన్న సీన్స్ కూడా అడిగి మరి మ్యూజిక్ కంపోజ్ చేయించుకునే వారని తెలిపారు మణిశర్మ.




