Vishnu Manchu: జిన్నా మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. మంచు విష్ణు క్రేజీ గెటప్‌ అదుర్స్

సాలిడ్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు మంచు విష్ణు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

Vishnu Manchu: జిన్నా మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. మంచు విష్ణు క్రేజీ గెటప్‌ అదుర్స్
Manchu Vishnu Jinnah
Follow us

|

Updated on: Jul 12, 2022 | 6:31 AM

సాలిడ్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు మంచు విష్ణు(Vishnu Manchu). హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే మోసగాళ్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష్ణు ఇప్పుడు మరో సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నాడు. విష్ణు సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలను లైనప్ చేశాడు విష్ణు. వాటిలో శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఢీ అంటే ఢీ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో పాటుగా నూతన దర్శకుడు సూర్య డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో సన్నీ లియోన్‌ కీలక పాత్ర పోషిస్టున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో సన్నీ నటిస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. అలాగే మెయిన్ హీరోయిన్ గా ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తుంది. ఈ సినిమాకు కోన వెంకట్ కథను అందించారు.

జిన్నా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విష్ణు గాలి నాగేశ్వరావు అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసిన చిత్రయూనిట్ తాజాగా ఈ మూవీనుంచి  మంచు విష్ణు లుక్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఫస్ట్ లుక్ తోపాటు మేకింగ్ వీడియోనూ రిలీజ్ చేశారు. ‘జిన్నా.. షాట్ రెడీ’ అని పిలవగానే విష్ణు ఓ గోడపై నుంచి జంప్ చేయడాన్ని ఈ వీడియోలో చూపించారు. వైట్ అండ్ వైట్ డ్రస్ లో మెడలో స్కార్ఫ్ వేసుకొని క్రేజీగా కనిపించాడు విష్ణు. అలాగే  రఫ్ గడ్డంతో కళ్ళజోడు పెట్టుకొని మాసీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే హీరోయిన్లతో కలిసి సినిమాని వినూత్న రీతిలో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు విష్ణు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి