The Warriorr : రామ్ కంటే ముందు ది వారియర్ సినిమాకోసం ఆ స్టార్ హీరోను సంప్రదించారట
ఉస్తాద్ రామ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ది వారియర్. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు

ఉస్తాద్ రామ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ది వారియర్(The Warriorr ). తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఎనర్జిటిక్ హీరో రామ్ కు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మొదటిసారి పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో రామ్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.
ది వారియర్ సినిమా కోసం ముందుగా రామ్ ను హీరోగా అనుకోలేదట. మరో స్టార్ హీరోను ఈ సినిమా కోసం ఎంపిక చేయాలనీ దర్శకుడు లింగు స్వామి భావించారట. ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..ఆ మధ్య బన్నీని లింగుసామి కలిసి కథా చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ కథ ఇదేననే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. అయితే ఈ సినిమాను ఫైనల్ చేసేలోగా పుష్ప సినిమా స్టార్ట్ అయిపోయింది. పుష్ప రెండు పార్టులు గా రానున్న విషయం తెలిసిందే. పుష్ప 2 అవ్వగానే బోయపాటి ఆవెంటనే త్రివిక్రమ్ సినిమాలు కమిట్ అయ్యి ఉన్నారు బన్నీ. దాంతో ఈ కథను రామ్ దగ్గరకు తీసుకువెళ్ళారట లింగుస్వామి. ఇప్పుడు ఇదే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.








