Suriya: బాల డైరెక్షన్‌లో మాసీవ్ పాత్రలో అలరించడానికి రెడీ అవుతున్న సూర్య..
హీరో సూర్య కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు సూర్య. వైవిధ్యమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.

హీరో సూర్య(Suriya)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు సూర్య. వైవిధ్యమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, బాలీవుడ్ సినీ పరిశ్రమల్లోనూ సూర్యకు అత్యధిక పాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సూర్యకు తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ఈటీ సినిమాతో వచ్చిన సూర్య.. వెరీ రీసెంట్ గా కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో చిన్న క్యామియో రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. రోలెక్స్ పాత్రలో మెరిసిన సూర్యను చూసి అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. ఇక ఇప్పుడు సూర్య టాలెంటెడ్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో శివపుత్రుడు సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సూర్య తోపాటు విక్రమ్ నటించారు.
తాజాగా సూర్య , బాల కాంబినేషన్ లో వస్తున్న సినిమానుంచి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సోమవారం బాల పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమానుంచి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను ‘వనంగాన్’ అనే టైటిల్ తో తెరకెక్కిస్తోన్నారు. తెలుగులో అచలుడు అనే టైటిల్ ను ఖరారు చేశారు. హీరో సూర్య ప్రీ లుక్ పోస్టర్ ని హీరో సూర్య సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. సూర్య ఈ మూవీలో చాలా మాసీవ్ పాత్రలో కనిపించబోతున్నారు. బాల మార్కు కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. సూర్య నటిస్తున్న 41వ ప్రాజెక్ట్ ఇది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో నటిస్తూనే హీరో సూర్య తన భార్య జ్యోతికతో కలిసి 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.




உங்களுடன் மீண்டும் இணைந்ததில் பெருமகிழ்ச்சி..! பிறந்தநாள் வாழ்த்துக்கள் அண்ணா…! #DirBala #வணங்கான் #Vanangaan #Achaludu pic.twitter.com/OAqpCRCWgx
— Suriya Sivakumar (@Suriya_offl) July 11, 2022




