Fish Venkat: ‘ఏ కష్టం వచ్చినా అన్నగా తోడుంటా’.. ఫిష్ వెంకట్ కూతురికి వీడియో కాల్ చేసి భరోసా ఇచ్చిన టాలీవుడ్ హీరో

టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన శుక్రవారం (జులై 18) రాత్రి తుది శ్వాస విడిచారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో నటుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Fish Venkat: ఏ కష్టం వచ్చినా అన్నగా తోడుంటా.. ఫిష్ వెంకట్ కూతురికి వీడియో కాల్ చేసి భరోసా ఇచ్చిన టాలీవుడ్ హీరో
Fish Venkat

Updated on: Jul 20, 2025 | 9:46 AM

టాలీవుడ్ కామెడీ విలన్ ఫిష్ వెంకట్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. శనివారం (జులై 19) మారేడుపల్లి లోని హిందూ స్మశాన వాటికలో నటుడి అంతక్రియలు నిర్వహించారు. వెంకట్ కడసారి చూపుకోసం పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో నటుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా కిడ్నీ సమస్యలతో ఆస్పత్రి పాలైన ఫిష్ వెంకట్ పట్ల సినిమా ఇండస్ట్రీ సరిగ్గా స్పందించలేదని విమర్శలు వస్తున్నాయి. సుమారు వందకు పైగా సినిమాల్లో నటించిన ఒక ప్రముఖ నటుడు చనిపోతే సినీ పెద్దల నుంచి కనీసం స్పందన లేదని పలువురు మండిపడుతున్నారు. విశ్వక్ సేన్, మానినేని కృష్ణ వంటి హీరోలు మాత్రమే వెంకట్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. అలాగే గబ్బర్ సింగ్ గ్యాంగ్ కూడా వెంకట్ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. అంత్యక్రియల సమయంలోనూ వీరే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక కమెడియన్ రచ్చరవి, నటుడు కరాటే కళ్యాణి తదితరులు మాత్రమే ఫిష్ వెంకట్ చివరి చూపు కోసం తరలి వచ్చారు. ఇదే సమయంలో ఫిష్ వెంకట్ మరణ వార్త తెలిసిన వెంటనే హీరో మంచు మనోజ్ తన టీమ్ ను నటుడి కుటుంబ సభ్యుల దగ్గరకు పంపించారు. వీడియో కాల్ ద్వారా ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 

ఇవి కూడా చదవండి

‘ఇదిగో నెంబర్.. మీకు ఏ సహాయం కావాలన్నా కాల్ చేయండి’

మంచు మనోజ్ వీడియో కాల్ చేసి మొదట వెంకట్ కుమార్తె స్రవంతితో మాట్లాడారు. ‘ అమ్మా.. నన్ను క్షమించండి ..నేను ప్రస్తుతం ఇక్కడ లేను.. మరొక రెండు రోజులలో హైదరాబాద్ వస్తాను. అప్పుడు తప్పకుండా నేనే మీ ఇంటికి వస్తాను. మీరు ఏమీ అ ధైర్య పడవద్దు. మీకు ఎప్పుడు కష్టం వచ్చినా అన్నగా నేను తోడుంటాను. మీకు ఒక నెంబర్ కూడా ఇస్తాను. ఏ చిన్న సహాయం కావాలన్నా వెంటనే కాల్ చేయండి’ అంటూ భరోసా కల్పించాడు మంచు వారబ్బాయి.

అనంతరం ఫిష్ వెంకట్ భార్యతో కూడా మాట్లాడారు మంచు మనోజ్. హీరోను చూడగానే కన్నీరు పెట్టుకున్నారామె. మనోజ్ ధైర్యం చెప్పి ఆమెను ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మంచు మనోజ్ చాలా మంచి పని చేశాడని సినీ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మనోజ్ లాగే ఇతర హీరోలు కూడా స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బన్నీ సినిమాలో ఫిష్ వెంకట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..