Manamey Review: మనమే మూవీ రివ్యూ.. శర్వానంద్ ఈ సారైనా హిట్ కొట్టాడా.?

ఫ్యామిలీ ప్లస్ యూత్ సినిమాలతో స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న నటుడు శర్వానంద్. కొన్ని సంవత్సరాలుగా ఈయనకు సరైన విజయం అందడం లేదు. తాజాగా మరోసారి మనమే అంటూ ఫ్యామిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వా. మరి ఈ సినిమా తాజాగా విడుదలైంది. ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Manamey Review: మనమే మూవీ రివ్యూ.. శర్వానంద్ ఈ సారైనా హిట్ కొట్టాడా.?
Manamey Movie Review
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Jun 07, 2024 | 12:35 PM

మూవీ రివ్యూ: మనమే

నటీనటులు: శర్వానంద్, కృతి శెట్టి, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, సీత, త్రిగున్, మౌనిక రెడ్డి తదితరులు

సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి

సినిమాటోగ్రఫీ: విష్ణు వర్మ, జ్ఞాన శేఖర్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య

నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల

ఫ్యామిలీ ప్లస్ యూత్ సినిమాలతో స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న నటుడు శర్వానంద్. కొన్ని సంవత్సరాలుగా ఈయనకు సరైన విజయం అందడం లేదు. తాజాగా మరోసారి మనమే అంటూ ఫ్యామిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వా. మరి ఈ సినిమా తాజాగా విడుదలైంది. ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

విక్రమ్ (శర్వానంద్) లండన్ లో చదువుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా హాయిగా బతికేస్తూ ఉంటాడు. విక్కీ బెస్ట్ ఫ్రెండ్ అనురాగ్ (త్రిగున్) లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. అనుకోకుండా ఫ్రెండ్ అతని భార్య శాంతి (మౌనిక రెడ్డి) ఒక ప్రమాదంలో చనిపోవడంతో వాళ్ళ బాబు ఖుషి బాధ్యతలు విక్రమ్ తీసుకోవాల్సి వస్తుంది. అతనితో పాటు సుభద్ర కూడా ఖుషి కి కేర్ టేకర్ గా ఉండాల్సి వస్తుంది. అప్పటికే సుభద్రకు కార్తీక్ (శివ కందుకూరి)తో ఎంగేజ్మెంట్ అవుతుంది. అయినా కూడా బాబు కోసం విక్రమ్ తో ఒకే ఇంట్లో కలిసి ఉండడానికి ఒప్పుకుంటుంది సుభద్ర. ఈ జర్నీలో వాళ్ళకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.. బాబు కోసం ఇద్దరూ ఒకటయ్యారా.. లేదంటే నిశ్చితార్థం చేసుకున్న అబ్బాయితోనే సుభద్ర పెళ్లి అవుతుందా.. బాబు ఫ్యూచర్ ఏంటి.. అనేది మిగిలిన సినిమా..

కథనం:

ఎన్నిసార్లైనా కనెక్ట్ అయ్యే ఎమోషన్.. ఫ్యామిలీ డ్రామా.. సరిగ్గా తీయాలే కానీ వంద సార్లు కాదు లక్ష సార్లు చూసినా బోర్ కొట్టదు. అదే.. సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే అంతకంటే బోర్ కొట్టే సినిమా మరొకటి ఉండదు. ఈ రెండింటికీ మధ్యలో ఆగిపోయింది మనమే సినిమా. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే అనిపిస్తుంది. కాస్త కామెడీ.. కాస్త ఎమోషన్.. శర్వానంద్, పిల్లాడి మధ్య వచ్చే సీన్స్ అన్ని బాగానే అనిపించాయి. తొలి సగం చూశాక శర్వానంద్ కు మంచి ఫ్యామిలీ సినిమా పడింది అనుకుంటారు ప్రేక్షకులు. కానీ అసలు కథ సెకండాఫ్ లోనే మొదలైంది. అప్పటికే స్టొరీ మొత్తం రివీల్ కావడంతో సెకండ్ హాఫ్ చెప్పేదేమీ లేక.. అక్కడక్కడే సీన్స్ అల్లుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. చాలా వరకు ఇవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సీరత్ కపూర్, సీనియర్ నటుడు విజయ్ కుమార్ ఎపిసోడ్స్ అయితే మరీ ఇరికించినట్టు ఉంటుంది. లాగ్ సీన్స్ చాలా ఉన్నాయి. వాటిని శర్వానంద్ కామెడీ తో కవర్ చేయాలని చూసినా వర్కవుట్ అవ్వలేదు.. ఈ సినిమాను ఇంకా చాలా బాగా తీయొచ్చేమో అనిపించింది. సినిమాలో మాటల కంటే పాటలే ఎక్కువగా ఉన్నాయి. ఒకటి రెండు కాదు ఏకంగా 16 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. ప్రతి ఎమోషన్ పాటలోనే చెప్పాలని చూసాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. అది కొంతవరకు మాత్రమే సక్సెస్ అయింది. పిల్లోడితో వచ్చే ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. ఎమోషన్స్ కూడా కొంతవరకు బాగానే వర్కౌట్ అయ్యాయి కానీ.. అనవసరంగా వచ్చే కొన్ని సన్నివేశాలు సినిమాపై ఇంప్రెషన్ దెబ్బతీసేలా ఉన్నాయి. చాలా మంచి సినిమా అయ్యే లక్షణాలున్న మనమే.. స్క్రీన్ ప్లే లోపాలతో వెరీ యావరేజ్ సినిమాగా మారిపోయింది.

నటీనటులు:

శర్వానంద్ తన వరకు చాలా బాగా చేశాడు. కామెడీతో బాగానే నవ్వించాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ మెచ్యూరిటీతో నటించాడు. కృతి శెట్టి కూడా పర్లేదు. వెన్నెల కిషోర్ ఉన్నది రెండు మూడు సీన్స్ అయినా కూడా బాగా నవ్వించాడు. రాహుల్ రామకృష్ణ ఉన్న లేనట్టే అనిపించింది. రాహుల్ రవీంద్రన్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఇక సినిమాలో హీరో, హీరోయిన్ తర్వాత అత్యంత కీలకపాత్ర చిన్నపిల్లడే. తన కొడుకుని పెట్టి సినిమా తీశాడు శ్రీరామ్ ఆదిత్య. ఆ బుడ్డోడు స్క్రీన్ మీద చూడటానికి చాలా క్యూట్ గా ఉన్నాడు.

టెక్నికల్ టీమ్:

మనమే సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ హేషం అబ్దుల్ వహాబ్ నేపథ్య సంగీతం. ఇందులో ఏకంగా 16 పాటలున్నాయి. సినిమా చూస్తున్నంత సేపు బ్యాగ్రౌండ్ లో ఏదో ఒక పాట వస్తూనే ఉంటుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పర్లేదు. కొన్ని సన్నివేశాలు తీసేయొచ్చు కానీ దర్శకుడు ఛాయిస్ కాబట్టి ఎడిటర్ ను తప్పు పట్టలేము. సినిమాటోగ్రఫీ వర్క్ మనమే సినిమాకు హైలైట్. యూకే అందాలు చాలా బాగా చూపించారు. బడ్జెట్ బాగుంది.. కాన్వాస్ అదిరింది.. కానీ కథ లేకపోవడంతో తేలిపోయింది మనమే. శ్రీరామ్ ఆదిత్య మరోసారి తనకు వచ్చిన ఛాన్స్ మిస్ యూస్ చేసుకున్నారేమో అనిపించింది.

పంచ్ లైన్:

ఓవరాల్ గా మనమే.. వెరీ యావరేజ్ ఫ్యామిలీ డ్రామా..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్