Anasuya Bharadwaj: అనసూయ ఒప్పుకుంటే గుడి కడతా..! పర్మిషన్ ఇవ్వమంటున్న వీరాభిమాని

న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రాంరంభించి ఆ తర్వాత యాంకర్‌గా మారింది ఈ ముద్దుగుమ్మ. యాంకర్‌గా ఎన్నో టీవీషోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఇక అనసూయ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Anasuya Bharadwaj: అనసూయ ఒప్పుకుంటే గుడి కడతా..! పర్మిషన్ ఇవ్వమంటున్న వీరాభిమాని
Anasuya Bharadwaj

Updated on: Jan 27, 2026 | 1:02 PM

అనసూయ.. ఈ ముద్దుగుమ్మ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు సినిమాల్లో రాణిస్తుంది అనసూయ. జబర్దస్త్ లో తన అందంతో, డాన్స్ లతో, చలాకీ మాటలతో ప్రేక్షకులను కవ్వించింది అనసూయ ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. దాంతో అనసూయకు అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో అనసూయ కీలక పాత్రల్లో కనిపించి మెప్పించింది.

ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ అందంలో కుర్రహీరోయిన్స్ తో పోటీపడుతోంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలు, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. రెగ్యులర్ గా తన సినిమా అప్డేట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను, ఫోటోలను కూడా పంచుకుంటుంది. ఇక అనసూయకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది అనసూయను అభిమానిస్తుంటారు.. కాగా అనసూయకు వీరాభిమాని అయిన ఓ పూజారి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

అనసూయ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆమె కోసం ఏకంగా గుడి కడతానని చెప్పుకొచ్చాడు. అనసూయ పర్మిషన్ ఇస్తే చాలు ఏకంగా ఆమె కోసం గుడి కడతామని తెలిపాడు. అనసూయ అంటే అభిమానమే కాదు అపారమైన గౌరవం కూడా ఉందని.. అప్పట్లో తమిళనాడులో హీరోయిన్ ఖుష్బూకు గుడి కట్టినట్టే అనసూయకు కూడా గుడి కడతామని.. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, అనసూయ అనుమతి కూడా తీసుకుంటాం. ఆమె అంగీకరిస్తే గుడి కట్టడం మొదలుపెడతాం అని చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీని పై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..