Kannappa Movie: ప్రభాస్, నయన్ మాత్రమే కాదు ‘కన్నప్ప’ సినిమాలో మరో స్టార్.. కీలకపాత్రలో మలయాళీ హీరో..

భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పరమ శివుడి మహా భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ మంచు విష్ణు పోషిస్తుండగా.. శివపార్వతులుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నయనతార నటించనున్నారు. దీంతో ఈ మూవీపై రోజు రోజుకి మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Kannappa Movie: ప్రభాస్, నయన్ మాత్రమే కాదు కన్నప్ప సినిమాలో మరో స్టార్.. కీలకపాత్రలో మలయాళీ హీరో..
Prabhas, Manchu Vishnu

Updated on: Sep 30, 2023 | 3:43 PM

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం దాదాపు 600 మంది సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా మంచు మోహన్ బాబు ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా స్తాయిలో నిర్మిస్తున్నారు. భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పరమ శివుడి మహా భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ మంచు విష్ణు పోషిస్తుండగా.. శివపార్వతులుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నయనతార నటించనున్నారు. దీంతో ఈ మూవీపై రోజు రోజుకి మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో ప్రభాస్, నయనతార, మంచు విష్ణు నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ కీలకపాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వార్త ట్విట్టర్ లో వైరలవుతుండగా.. దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ హర హర మహాదేవా అంటూ రిప్లై ఇచ్చారు. గతంలో ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్రలో నటించనున్నారంటూ ప్రచారం నడవగా.. హర హర మహాదేవా అంటూ రిప్లై ఇచ్చి క్యూ ఇచ్చారు మంచు విష్ణు. ఇప్పుడు మోహన్ లాల్ సైతం కీలకపాత్ర పోషించనున్నాడనే వార్తలకు మరోసారి హర హర మహాదేవా అంటూ రిప్లై ఇచ్చి క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మహాభారతం టెలివిజన్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కథానాయికగా పాత్ర కోసం కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ ను ఎంపిక చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి నుపుర్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.150 కోట్ల బడ్డెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ న్యూజిలాండ్ లో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.