Jailer and Jailer: నా జైలర్ సినిమాకు థియేటర్స్ ఇవ్వడం లేదు : మలయాళ దర్శకనిర్మాత సక్కీర్
ఒక టైటిల్ తో ఉన్న రెండు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవేంటంటే.. ఈ నెల 10న థియేటర్స్ దగ్గర సందడి చేయడానికి రెడీ అవుతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన నటిస్తున్న జైలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీకి భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ ట్రైలర్ లో రజినీకాంత్ స్టైల్, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయనే చెప్పాలి.
ఒకే టైటిల్ తో రెండు సినిమాలు రావడం అందేది కామనే.. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓకే టైటిల్ తో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఒకే టైటిల్ తో ఉన్న రెండు సినిమాలు ఒకే సారి రిలీజ్ మాత్రం కాలేదు. కానీ ఇప్పుడు అదే జరగబోతుంది. ఒక టైటిల్ తో ఉన్న రెండు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవేంటంటే.. ఈ నెల 10న థియేటర్స్ దగ్గర సందడి చేయడానికి రెడీ అవుతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన నటిస్తున్న జైలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీకి భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ ట్రైలర్ లో రజినీకాంత్ స్టైల్, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయనే చెప్పాలి.
జైలర్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా ఆయన నటించిన అన్నత్తే సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఆయన నుంచి సాలిడ్ హిట్ ను ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జైలర్ ను తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు నెల్సన్ దిలీప్.
మలయాళ జైలర్
రజినీకాంత్ జైలర్ మూవీకి పోటీగా మలయాళ ఇండస్ట్రీ నుంచి జైలర్ అనే సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ పై మలయాళ దర్శకనిర్మాత సక్కీర్ మదతిల్ కోర్టును కూడా శ్రయించాడు.తన సినిమా టైటిల్ తో రజినీకాంత్ సినిమా వస్తుందని టైటిల్ ను మార్చాలని డిమాండ్ కూడా చేశారు. 2021లోనే జైలర్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేశాను అని తెలిపాడు దర్శకనిర్మాత సక్కీర్.
జైలర్ వర్సెస్ జైలర్
ఇదిలా ఉంటే రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయి. ఆగస్టు 10న రజినీకాంత్ జైలర్ తో పాటు మలయాళ జైలర్ కూడా రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. సూపర్ స్టార్ సినిమా కారణంగా తమ సినిమాకు థియేటర్స్ ఇవ్వడంలేదని సక్కీర్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో రజినీకాంత్ సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నారని సక్కీర్ చెప్పుకొచ్చాడు. తన సినిమా రిలీజ్ ముందు ఇలాంటి గొడవలు జరుగుతుండటంతో తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందని తెలిపాడు సక్కీర్.
#Jailer Aus/Nz Bookings are Now open! @rajini pic.twitter.com/9jo1Sj61H8
— JAILER (@Jailer_Movie) August 4, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి