అబ్బాయిలకంటే ఆమె బెటర్.. ఫ్రెండ్ మెడలో తాళికట్టిన నటి.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్..
అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడం చాలా కామన్.. కానీ ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. తాజాగా ఓ నటికీ సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ నటి తన బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ గా మారాయి.

ఇటీవల సినీ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాలను ప్రారంభించారు. స్టార్ హీరోలు, కుర్ర హీరోయిన్స్ చాలా మంది పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. అయితే ఇప్పుడు ఓ నటి తన బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంది. ఇందులో ఏముంది అనుకుంటున్నారా.? ఆమె బెస్ట్ ఫ్రెండ్ కూడా ఓ అమ్మాయే.. అబ్బాయిల కంటే తనే నయం అంటూ ఆ నటి షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఒకరికొకరు మెడలో తాళి కట్టుకుని దండలు మార్చుకుని ముద్దులు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దాంతో ఈ వీడియో పై ఆ నటి పై నెటిజన్స్ పెద్దెత్తున విమర్శలు కురిపిస్తున్నారు. ఇంతకూ ఆ నటి ఎవరో తెలుసా.?
మలయాళ నటి ప్రార్థన కృష్ణ నాయర్ తన బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో ప్రార్థన తన స్నేహితురాలు అన్సియాతో సాంప్రదాయ హిందూ వివాహ ఆచారాలతో పెళ్లి చేసుకుంది. మెడలో తాళి కట్టుకుంటూ.. దండాలు మార్చుకున్నారు. అంతే కాదు ముద్దులు కూడా పెట్టుకున్నారు. దీనితో ఇది స్వలింగ వివాహంగా చాలామంది ఊహించారు. కొంతమంది నెటిజన్స్ విమర్శలు కూడా కురిపించారు. అయితే, ప్రార్థన ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.
ఆ వీడియో సరదాగా పోస్ట్ చేసిన వీడియో మాత్రమేనని, ఇది నిజమైన వివాహం కాదని తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. “ఇది కేవలం షూట్ మాత్రమే, నిజమైన పెళ్లి కాదు. మేము ఇతర పరిశ్రమల నటీమణులు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ట్రెండ్‌ను ఫాలో అయ్యాం.. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్, ఆమెకు పెళ్లయింది.. ఒక కొడుకు కూడా ఉన్నాడు,” అని క్లారిటీ ఇచ్చింది. ఈ షూట్‌లోని బోల్డ్ క్యాప్షన్స్, విజువల్స్ పబ్లిక్‌లో ఊహాగానాలకు దారితీశాయి. కానీ ప్రార్థన ఇది కేవలం సోషల్ మీడియా కోసం చేసిన సరదా ప్రాజెక్ట్ అని క్లారిటీ ఇచ్చింది.
View this post on Instagram




