Malavika Mohanan: ఆ హీరోతో సినిమా చేయడం కోసం ఆగలేకపోతుందట ఈ భామ
మాళవిక మోహన్.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల్లో కావలసినంత క్రేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ చిన్నదాని గ్లామర్ షోకు ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరేమో..
మాళవిక మోహన్(Malavika Mohanan).. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల్లో కావలసినంత క్రేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ చిన్నదాని గ్లామర్ షోకు ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరేమో.. అంతలా అందాలు ఆరబోస్తూ కుర్రకారును కట్టిపడేస్తుంది మాళవిక. పట్టం పోల్ అనే మలయాళ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ అమ్మడు. మలయాళ , తమిళ్ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో మాళవిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ చిన్నదానికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. రీసెంట్ గా ధనుష్ తో కలిసి ఓ సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే టాలీవుడ్ లోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇవ్వనుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో మారుతి సినిమా ఒకటి. సలార్ , ఆదిపురుష్, ప్రోజక్ట్ కే సినిమాలతో పటు మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవికాను ఎంపిక చేశారని టాక్ . తాజాగా ఈ చిన్నది తన స్నేహితుల దగ్గర మాట్లాడుతూ.. ప్రభాస్ తో షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు చాలా ఆసక్తిగా ఉన్నానని.. ఎప్పుడెప్పుడు షూట్ లో జాయిన్ అవుతానా అంటూ ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకుందట. మాళవిక మోహనన్ ఈ సినిమాలో నటిస్తున్న విషయం త్వరలోనే కన్ఫామ్ చేసే అవకాశం ఉంది.