AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghani: మెగా హీరో కోసం రెండు రిలీజ్ డేట్స్.. గని థియేటర్లోకి వచ్చేది అప్పుడే అంటున్న మేకర్స్..

మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గని (Ghani). ఈ సినిమాతో డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి (Kiran Korrapati)

Ghani: మెగా హీరో కోసం రెండు రిలీజ్ డేట్స్.. గని థియేటర్లోకి వచ్చేది అప్పుడే అంటున్న మేకర్స్..
Ghani
Rajitha Chanti
|

Updated on: Feb 01, 2022 | 1:47 PM

Share

మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గని (Ghani). ఈ సినిమాతో డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి (Kiran Korrapati) దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, గీతా ఆర్ట్స్  బ్యానర్లపై అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసే పనిలో ఉంది. ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ సైతం తన పాత్రకు డబ్బింగ్ కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

గని సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీ కోసం మెగా అభిమానులు క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కరోనా కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. తాజాగా గని చిత్రం కోసం మేకర్స్ రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 25న లేదా మార్చి 4న థియేటర్లలో విడుదల చేస్తామని కాసేపటి క్రితం మేకర్స్ తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ రెండింటిలో గని ఏ తేదీన వస్తాడు.. మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందా అంటూ నెటిజన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‏గా నటిస్తున్నాడు. అలాగే ఇందులో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా, నరేష్, తనికెళ్ల భరణి, నవీన్ చంద్ర కీలకపాత్రలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Suman: సైన్యానికి 117 ఎకరాల భూమి విరాళం.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరో..

Pooja Hegde: ఆనందంలో తెగ మురిసిపోతున్న బుట్టబొమ్మ.. నెక్ట్స్ లెవల్ ఎక్స్‏పిరియన్స్ అంటూ పూజా హెగ్డే పోస్ట్..

30 Weds 21 Season 2: ఆకట్టుకుంటున్న 30 వెడ్స్ 21 టీజర్.. ప్రపంచాన్ని చూసేందుకు సిద్ధమయిన జంటపక్షులు..

Thamannah: తమన్నా ఛాలెంజ్‏కు భారీ రెస్పాన్స్.. సోషల్ మీడియాలో మిల్కీబ్యూటీ రచ్చ మాములుగా లేదుగా..