Major Movie: ఆ విషయం చెప్పగానే సందీప్ తండ్రి గెట్ అవుట్ అన్నారు.. మేజర్ ప్రొడ్యూసర్ కామెంట్స్..

మేజర్ సినిమా చూసి సందీప్ తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేశారన్నారు.. వారికి జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ఇవ్వగలిగాం అని అనుకుంటున్నామన్నారు

Major Movie: ఆ విషయం చెప్పగానే సందీప్ తండ్రి గెట్ అవుట్ అన్నారు.. మేజర్ ప్రొడ్యూసర్ కామెంట్స్..
Major Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 08, 2022 | 8:34 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మేజర్ (Major) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులలో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మేజర్ సందీప్ జీవితంలో జరిగిన సంఘటనలను మళ్లి వెండితెరపై చూపించారు డైరెక్టర్ శశికిరణ్ తిక్క.. ఇందులో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించగా.. అతని తల్లిదండ్రులుగా ప్రకాష్ రాజ్, రేవతి నటించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో ‘మేజర్’ చిత్రం ఒక మైలురాయని కితాబిచ్చారు. చాలామంది యూత్ మేజ‌ర్ సందీప్‌లా సైనికులు అవ్వ‌డానికి ఆస‌క్తిచూపుతున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు అనురాగ్‌, శ‌ర‌త్ సంయుక్తంగా మీడియాతో త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

మేజర్ సినిమా చూసి సందీప్ తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేశారన్నారు.. వారికి జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ఇవ్వగలిగాం అని అనుకుంటున్నామన్నారు మేజర్ నిర్మాతలు అనురాగ్, శరత్.. అయితే ఇది జీవితకథ కాబట్టి.. వారి తల్లిదండ్రులకు రాయల్టీ కింద ఏమైనా డబ్బులు ఇచ్చారా ? అని విలేకరి అడగ్గా.. మేజర్ నిర్మాతలు బదులిచ్చారు.. “రాయల్టీ ఇవ్వ‌డానికి మేము సిద్ధంగా వున్నాం. ఇదే విష‌యం వారికి ముందుగానే చెప్పాం. కానీ ఆ మాట విన‌గానే గెటౌట్ ఫ్ర‌మ్ మై హౌస్ అంటూ ఆవేశంగా మాట్లాడారు. తమ కొడుకు జీవితాన్ని వెలకట్టే ధీనస్థితిలో తాము లేమన్నారు. సందీప్‌కు ఎల్‌.ఐ.సి. పాల‌సీ డ‌బ్బులు కూడా తీసుకోలేదు. అంత నిజాయ‌తీమ‌నుషులు. అందుకే వారితో ఓ విష‌యం చెప్పాం. మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ ఫౌండేష‌న్ లో యువ‌త మిల‌ట్రీలో చేరాల‌నుకున్న‌వారికి వెల్‌క‌మ్ చెబుతూ, అందుకు త‌గిన ఏర్పాట్లు, సందేహాలు ఇస్తూ వారికి స‌పోర్ట్‌గా నిలిచేలా సోష‌ల్‌మీడియా వేదిక నెల‌కొల్పాల‌నుకున్నాం. అదే మేం వారి త‌ల్లిదండ్రుల‌కు ఇచ్చే రాయ‌ల్టీ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..