Mahesh Babu: ‘మహేశ్.. ఫ్యాన్స్‌కు ఎమోషన్’.. ఒక్క పోస్ట్‌తో మనసులను కదిలించిన నమ్రత..
ఈసారి సంక్రాంతి పండక్కి మహేష్ అభిమానులకు ఫుల్ మీల్స్ అందిస్తున్నారు. గ్యాప్ తీసుకున్నా.. ఈసారి థియేటర్లలో గుంటూరు కారం సినిమాతో రచ్చ చేయనున్నారు గురూజీ. ఇందులో మీనాక్షి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే థమన్ అందించిన సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ సతీమణి నమ్రత ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుతూ..

ప్రస్తుతం మహేష్ నటించిన గుంటూరు కారం ఈనెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో గురూజీ మరోసారి ప్రేక్షకుల ముందుకు తన మాస్ మార్క్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. అది కూడా సూపర్ స్టార్ తో. ఇంకేముంది ఈసారి సంక్రాంతి పండక్కి మహేష్ అభిమానులకు ఫుల్ మీల్స్ అందిస్తున్నారు. గ్యాప్ తీసుకున్నా.. ఈసారి థియేటర్లలో గుంటూరు కారం సినిమాతో రచ్చ చేయనున్నారు గురూజీ. ఇందులో మీనాక్షి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే థమన్ అందించిన సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ సతీమణి నమ్రత ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుతూ.. ఫ్యాన్స్ అందరినీ ఏడిపించేసింది. ఇంతకీ నమ్రత ఏమని పోస్ట్ చేసిందో చూద్దామా.
మహేష్! ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది.! ఇది నిన్న మొన్నటి వరకు..! మహేష్ ! ఆ పేరులో ఎమోషన్ కూడా ఉంది. ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తుంది. ఇది గుంటూరు కారం ఈవెంట్ చూశాక అందరూ చెబుతున్నా మాట. ఆయన భార్య నమ్రత కూడా… చెబుతున్నారు ఇదే మాట. ఫ్రెండ్గా.. లవర్‌గా.. భార్యగా.. ఎప్పుడూ మహేష్ వెన్నంటి ఉంటున్న నమ్రత.. తాజాగా ఎమోషనల్ అయ్యారు. గుంటూరులో జరిగిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. మహేష్ చేసిన స్పీచ్ చూసిన ఈమె.. మహేష్ అభిమానుల్లో.. ఉన్న మహేష్ అనే ఎమోషన్ మొత్తాన్ని కోట్ చేస్తూ.. ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. అందులో మహేష్ ఎంతగానో ప్రేమిస్తున్న అభిమానులకు స్పెషల్ థాంక్స్ చెప్పారు చేతులెక్కి మొక్కారు. నా హృదయం నిండిపోయిందంటూ.. తన పోస్టును ఎండ్ చేశారు.
View this post on Instagram
“మహేశ్ ఫ్యాన్స్ గురించి ఇప్పటికే చాలా మంది గొప్పగా చెప్పారు. తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. వరల్డ్ వైడ్.. ఎంతోమంది ఆయన్ని ఆదరిస్తున్నారు. ప్రతీ ప్రయత్నంలో ఆయనకు అండగా నిలిచి.. మరింత కష్టపడి పనిచేసేందుకు బూస్టప్ ఇచ్చారు. ఇక గుంటూరులో జరిగిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో… ఫ్యాన్స్ చూపించిన ప్రేమను చూసి ఓ విషయం గర్వంగా చెప్పాలని ఉంది. మహేశ్.. ఫ్యాన్స్‌కు ఎమోషన్. ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా” అని తన పోస్టులో రాసుకొచ్చారు నమ్రత. అంతేకాదు ఈ పోస్ట్‌తో.. మహేష్ డై హార్డ్ ఫ్యాన్స్‌ను నెట్టింట ఎమోషనల్ అయ్యేలా కూడా చేస్తున్నారు నమ్రత.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
