
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ పుట్టిన రోజు నేడు (ఆగస్టు 31). దీంతో సినీ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు, నెటిజన్ల గౌతమ్ కు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో 20వ వసంతంలోకి అడుగుపెడుతున్న గౌతమ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఫస్ట్ టైమ్.. ఈ ఏడాది నీ పుట్టినరోజును మిస్సవుతున్నా అంటూ మహేష్ అందులో రాసుకొచ్చారు. నీ ప్రతి అడుగులో నా ప్రేమ ఉంటుందని గౌతమ్ పై ప్రేమ కురిపించారు. ’19 ఏళ్ల నా కుమారుడు.. ప్రతి సంవత్సరం నన్ను కొంచెం ఎక్కువగానే ఆశ్చర్యపరుస్తున్నావ్. ఈ సంవత్సరం నీ పుట్టినరోజు మిస్ అవుతున్నా. నా ప్రేమ నీ ప్రతి అడుగులోనూ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నువ్వు చేసే ఏ పనిలోనైనా ఎల్లప్పుడూ నువ్వే అతిపెద్ద చీర్ లీడర్… ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ, ఎదుగుతూ ఉండు’ అంటూ తన కుమారుడిపై ప్రేమకు అక్షర రూపమిచ్చాడు మహేష్. ఈ పోస్ట్ కు గౌతమ్ తో కలిసున్న ఒక త్రో బ్యాక్ ఫొటోను జత చేశాడీ సూపర్ స్టార్.
టాలీవుడ్ ప్రిన్స్ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో మహేష్, గౌతమ్ చాలా క్యూట్ గా ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి టాప్ స్టార్స్ ఈ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. .
Happy 19 my son!! Each year you amaze me a little more… ♥️♥️♥️ Missing your birthday this year, the only one i have ever missed… my love is with you every step of the way….😘😘😘 Always your biggest cheerleader in whatever you do… keep shining and keep growing…🤗🤗🤗 pic.twitter.com/0bV51ZRR8S
— Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.